బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు .. నారా లోకేష్ భార్యగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే .. ఇదే శ్రమలో బిజినెస్ ఉమెన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బ్రాహ్మణి .. అయితే ఆమె గురించి అంతకుమించి పెద్దగా బయట ఎవరికి ఏమీ తెలియదు .. అయితే బ్రాహ్మణి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నే బాలయ్య స్వయంగా అందరికీ చెప్పారు. ఆయన వ్యాఖ్యాతిగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ లో ఒకప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు .. ఈ షో సీజన్ 4, 8వ ఎపిసోడ్లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ దర్శకుడు బాబి , మ్యూజిక్ డైరెక్టర్ తమన్ , నిర్మాత నాకు వంశీ గెస్ట్లుగా వచ్చారు .. ఈ కార్యక్రమంలో మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని బాగా గారాబంగా పెంచారు ? అని తమన్ అడగ్గా బాలకృష్ణ దానికి స్పందిస్తూ .. ఇద్దరినీ గారాబంగానే పెంచానని చెబుతూ మణిరత్నం సినిమా అవకాశాన్ని గుర్తు చేశారు.ఇదే సమయంలో బాలయ్య మాట్లాడుతూ మణిరత్నం గారు అప్పట్లో ఓ సినిమా కోసం హీరోయిన్గా బ్రాహ్మణిని అడిగారు ..
ఇక ఇదే ఇదే విషయాన్ని నా కూతురుకు చెబితే మై ఫేస్ (నా ముఖం) అని సమాధానం ఇచ్చింది మీ ఫేస్ కోసమే అడుగుతున్నానని అన్నా చివరికి ఆసక్తి లేదని నేను చేయనని చెప్పేసింది .. అలాగే తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేది చిన్న కూతురైన నటి అవుతుందని అనుకున్నా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ షో ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్ గా ఉంది .. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళ తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి ఎదిగారంటే అంతకుమించి నాకు కావాల్సిందేముంది .. నేను భయపడేది నా పెద్ద కూతురు బ్రాహ్మణికి అని ఆయన అన్నారు. అలాగే బ్రాహ్మణికి తన తండ్రి బాలయ్య కాకుండా మరొక హీరో అంటే కూడా ఎంతో ఇష్టమట .. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.. ఆయన నటనపరంగా, డాన్స్ పరంగా చాలా ఇష్టమని చిరంజీవి హీరోగా సినిమా విడుదలవుతుందంటే చాలు మొదటి రోజే ఆమె సినిమా చూడ్డానికి వెళ్తుందట ఈ విషయాన్ని కూడా స్వయంగా బాలయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.