సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్లు అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. అలా సినిమాలకు దూరం అయినా కూడా ప్రేక్షకులు వారు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలలో వారు కూడా మళ్లీ సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తమిళ్ , మలయాళ ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజీ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన ఓ ముద్దు గుమ్మ సడన్ గా సినిమాలకు దూరం అయింది.
ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆ ముద్దు గుమ్మ మళ్ళీ తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు అర్చన కవి. ఈ బ్యూటీ అనేక తమిళ్ , మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న తెలుగు లో బ్యాక్ బెంచ్ అనే ఒకే ఒక సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా విజయాన్ని అందుకోకపోవడంతో ఈమెకు తెలుగు లో పెద్దగా క్రేజ్ దక్కలేదు. కానీ ఈమె తమిళ్ , మలయాళ ఇండస్ట్రీలలో మాత్రం అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. తొమ్మిదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్న ఈమె ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈమె తాజాగా నటించిన ఐడెంటిటీ సినిమా మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అర్చన అవి మాట్లాడుతూ ... నాకు నేనుగా సినిమాలకు దూరం కాలేదు. ఎవరూ కూడా నాకు సినిమాల్లో అవకాశాలివ్వలేదు. అందుకే 9 సంవత్సరాలలో నేను ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. 2013 వ సంవత్సరంలో నాకు వివాహం అయ్యింది. ఆ తర్వాత విడాకులవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నెమ్మదిగా నేను దాని నుంచి కోలుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఈ మూవీ చేశాను అని అర్చన కవి తాజాగా చెప్పుకొచ్చింది.