సురేష్ బాబు: సంక్రాంతికి ఫ్యామిలీలే టార్గెట్..సినిమాలన్నీ బ్లాక్ బస్టరే ?
ముఖ్యంగా దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన.. గోపాల గోపాల సినిమా సంక్రాంతి కానుక 2015 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా జనవరి 10వ తేదీ 2015లో రిలీజ్ కావడం జరిగింది. ఇందులో విక్టరీ వెంకటేష్ అలాగే పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించారు. చేసింది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ... 70 శాతం లాభాలు పొందారు సురేష్ బాబు. 12 కోట్లతో సినిమా తీస్తే 90 కోట్లు రావడం జరిగింది.
గోపాల గోపాల తర్వాత సంక్రాంతి కానుకగా నువ్వు లేక నేను లేను అనే సినిమాను 2002 సంవత్సరంలో రిలీజ్ చేయించుకున్నారు దగ్గుబాటి సురేష్ బాబు. ఈ సినిమా ఇప్పటికీ కూడా.. అందరూ కుటుంబ సమేతంగా చూస్తారు. ఈ సినిమాలో తరుణ్ అలాగే ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. 2002 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది.
ఇక తన తమ్ముడు విక్టరీ వెంకటేష్ తో కలిసి ఎక్కువగా సినిమాలు చేసిన దగ్గుబాటి సురేష్ బాబు... కలిసుందాం రా సినిమాతో ఒక మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమాను కూడా 2000 సంవత్సరం సంక్రాంతి కానుకగా బరిలోకి దింపారు దగ్గుబాటి సురేష్ బాబు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేయగా సిమ్రాన్ హీరోయిన్గా చేసింది. ఫ్యామిలీ కథ నేపథంలో వచ్చిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసి... డబ్బులు బాగానే సంపాదించారు దగ్గుబాటి సురేష్ బాబు.