ఏపీ:కొడుకు చెంతకు విజయమ్మ.. షర్మిల ఒంటరేనా..?

Divya
గత ఏడాది ఎక్కువగా జగన్ వర్సెస్ షర్మిల అనే విధంగా వివాదాలు చాలానే చోటు చేసుకున్నాయి. కేవలం వీరి కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు వ్యక్తిగతంగా కూడా భేదాభిప్రాయాలను సృష్టించేలా చేశాయి. తన అన్న జగన్ ని కూడా షర్మిల రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా కూడా బాధ్యతలు చేపట్టినప్పటికీ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా తన అన్నయ్యనే టార్గెట్ చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున షర్మిల పైన విమర్శలు కూడా వినిపించాయి.

ఇలా షర్మిల వ్యవహరించే తీరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమాత్రం నచ్చలేదు.. హై కమాండ్ కు కూడా చాలా మంది సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారట. దీంతో షర్మిలని కూడా పీసీసీ పదవి నుంచి తప్పించే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా కూడా షర్మిల సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగానే ఉన్నది.. క్రిస్మస్ పండుగ కూడా కేవలం తన భర్త కొడుకులు కూతురు తో మాత్రమే జరుపుకున్నది షర్మిల. న్యూ ఇయర్ కి కూడా ఎలాంటి పోస్టులు షేర్ చేయలేదు.

వైయస్ విజయమ్మ తన కొడుకు కోడలు మనవరాళ్లతో చాలా గ్రాండ్ గా క్రిస్మస్ వేడుకలను పులివెందులలో జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే తన కూతురు కారణంగా కొడుక్కి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయం పైన విజయమ్మ గ్రహించారని అందుకే తన కొడుకు దగ్గరికి చేరిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. తన కుటుంబాన్ని మొత్తం ఏకధాటిగా నడిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో సైలెంట్ గా ఒంటరిగా షర్మిల ఉన్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పొత్తు అవసరం పడుతుందని.. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కే పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే షర్మిల మౌనం ఎందుకే నేమో అన్నట్లుగా టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: