24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించి న టాప్ 5 తెలుగు ట్రైలర్స్ ఏ వో తెలుసు కుందాం.
పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 44.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దానితో ఈ మూవీ ఇప్పటివరకు తెలుగు సినిమా ట్రైలర్లలో విడుదల 24 గంటలు అత్యధిక వ్యూస్ ను అందుకున్న ట్రైలర్లలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
గుంటూరు కారం : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కు 24 గంటల సమయంలో 37.68 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దానితో ఈ మూవీ ట్రైలర్ రెండవ స్థానంలో నిలిచింది.
గేమ్ చేంజర్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా కియార అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేయగా ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 36.24 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
సలార్ : ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 32.58 మిలియన్ న్యూస్ వచ్చాయి.
సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురాం పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 26.77 మిలియన్ వ్యూస్ వచ్చాయి.