హిట్టుకి ఆ సినిమా కేరాఫ్ అడ్రెస్.. 7సార్లు రీమేక్ చేసినా?
ఆ సినిమానే దృశ్యం. 2013లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సినిమా ఇది. మోహన్ లాల్ ఇందులో లీడ్ రోల్ చేయగా మీనా, అంజిబా హాసన్, ఎస్తేర్ అనిల్, ఆషా శరత్ తదితరులు నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పట్లోనే ఈ సినిమా థియేటర్లలో ఏకంగా 150 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమా విజయాన్ని చూసి, తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో రీమేక్ చేయడం జరిగింది. 2014లో కన్నడ, తెలుగులో రీమేక్ కాగా సూపర్ హిట్ అయింది. తెలుగులో వెంకటేష్ ఈ సినిమాను చేయగా తమిళంలో పాపనాశం పేరుతో కమల్ హాసన్, గౌతమి నటించారు. అలా విడుదలైన రెండు భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఆ తరువాత ఈ సినిమా హిందీలో కూడా దృశ్యం పేరుతోనే రీమేక్ అయ్యింది. ఇందులో అజయ్ దేవగన్, శ్రియా, టబు ప్రధాన పాత్రలు పోషించగా అక్కడ కూడా భారీ హిట్ అయింది. అలా ఇండియాలో అన్ని భాషల్లోనూ విజయం సాధించిన దృశ్యం, 2017లో శ్రీలంకలో రీమేక్ అయ్యింది. సింహళ భాషలో ధర్మ యుద్ధం పేరుతో రీమేక్ కాగా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇండియాలోనే కాకుండా చైనాలో కూడా రీమేక్ అయ్యింది. Sheep Without a Shepherd పేరుతో 2019లో విడుదలై సూపర్ హిట్టైంది. ఆ తరువాత ఇండోనేషియన్, కొరియన్ భాషల్లో కూడా రీమేక్ అవుతుందని ప్రకటించారు. ఇలా ఏడేళ్లుగా ఈ సినిమా రీమేక్ అవుతూనే ఉంది. విడుదలైన అన్ని చోట్ల విజయం సాధించింది. ఇలా రీమేక్ అయిన అన్ని చోట్ల సక్సెస్ అయిన సినిమాగా దృశ్యం రికార్డు క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.