పుష్ప 2 ఇండియన్ సినీ చరిత్రలోనే బుక్ మై షో లో సరికొత్త రికార్డు .. ఎన్ని టికెట్లు అమ్మారంటే..!
ఇక తాజాగా ఇప్పుడు పుష్ప 2 మూవీ మరో అరుదైన రికార్డును అందుకుంది. బుక్ మై షో లో పుష్ప 2 మరో అర్దైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది .. రిలీజ్ కు ముందు నుంచి పుష్పా2 సినిమా బుకింగ్‌తో బుక్ మై షోలో సందడి మామూలుగా లేదు .. గంటకి లక్ష అంతకుమించి టికెట్లు బుక్ మై షో లో బుక్ అవుతూ వచ్చాయి .. అలాగే వీకెండ్ లో అయితే రచ్చ రచ్చ చేసింది. తాజాగా ఇప్పుడు బుక్ మై షోలో పుష్ప 2 సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది .. ఈ సినిమా టికెట్లు అమ్మకాలు రెండు కోట్లు దాటాయని బుక్ మై షో స్వయంగా ప్రకటించింది. ఇక బుక్ మై షో లో పుష్ప 2 మొదటి నుంచి రికార్డులు క్రియేట్ చేస్తూనే దూసుకుపోతుంది .. పుష్ప 2 మొదటి ఐదు రోజుల పూర్తికాకుండానే పుష్ప 2కి బుక్ మై షో లో ఏకంగా 10 మిలియన్ల టికెట్లు బుక్ అయ్యాయి ..
ఇక అతి తక్కువ సమయం లోనే కోటి టికెట్లు అమ్ముడైన సినిమాగా పుష్ప 2 సినిమా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది ఇప్పుడు రెండు కోట్ల టికెట్లు అమ్ముడైన రికార్డ్ తో ఇండియాలోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇదె క్రమంలో పుష్ప 2 సినిమా నాలుగు వారాల్లో రికార్డ్స్ స్థాయి కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది .. ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు 1799 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ మేరకు ఈ సినిమా అధికార పోస్టర్ను రిలీజ్ చేశారు . ఇక పుష్ప 2 ఎవరు ఊహించని రికార్డ్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను దడ పుట్టిస్తుంది. ఇప్పటికే బాహుబలి 2 దంగల్ రికార్డును కూడా త్వరలోనే పుష్ప 2 బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.