వెరైటీగా సోన‌మ్‌ కపూర్ వెడ్డింగ్ కార్డ్!

Edari Rama Krishna
బాలీవుడ్ లో  హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది సోనమ్ కపూర్.  ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించిన సోనం తండ్రి అనీల్ కపూర్ నట వారసత్వంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఈ అమ్మడు నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా..సోనమ్ కపూర్ కి మాత్రం మంచి క్రేజ్ లభించింది.  సోషల్ మీడియాలో ఎప్పుడూ వివాదాలకు కేంద్రంగా నిలిచే ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది. 

బోనికపూర్ తమ్ముడు అయిన అనీల్ కపూర్ కూతురుగా సోనమ్ కపూర్ ఆమె తమ్ముడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.  ఈ మద్య బోనీకపూర్ సతీమణి..అందాల తార శ్రీదేవి దుబాయ్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ విషాదాన్ని మరచిపోతున్న కపూర్ ఫ్యామిలీలో ఇప్పుడు పెళ్లి బాజా మోగబోతుంది.

మొన్న‌టి వ‌ర‌కు పెళ్లి వార్త‌ల‌పై స్పందించ‌ని క‌పూర్ కుటుంబం .. ఇప్పుడు తాజాగా దీనిపై అటు అనిల్ క‌పూర్‌, ఇటు సోన‌మ్ క‌పూర్ స్ప‌దించి పెళ్లి వార్త‌ను ధృవిక‌రించారు.సోన‌మ్ ఆనంద్ అహూజా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగ‌తి తెలిసందే. వీరి ప్రేమ‌ను ఇరు కుటుంబ స‌భ్యులు అంగీక‌రించడంతో వీరి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేశారు.

తన పెళ్లి విదేశాల్లో చేసుకోనని..ఆ ఖర్చు ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ కి అందిస్తానని ఈ మద్య సోనమ్ కపూర్ అన్న విషయం తెలిసిందే. అంతే కాదు తాము పేపర్ ను వృథా చేయబోమని.. పెళ్లి శుభలేఖల సంస్కృతి పర్యావరణానికి హాని చేస్తుందని చెప్పుకొచ్చింది సోనమ్.

మే నెల7వ తేదీన మెహందీ ఫంక్షన్ ను బీకేసీ- సిగ్నేచర్ ఐల్యాండ్ లో నిర్వహిస్తుండగా.. మే8న బాద్రాలో పెళ్లి జరగనుంది. అదే రోజు సాయంత్రం 8 గంటలు ముంబైలోని హోటల్ లీలా లో గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నట్లుగా ఈ-ఇన్వైట్స్ చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: