వర్మను కుక్కతో పోల్చింది..!

Edari Rama Krishna
తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో తెరపైకి వచ్చిన వర్మ ఆ మద్య ఓ బాలీవుడ్ హీరోపై తెగ కామెంట్స్ చేస్తూ ట్విట్టర్ లో పెట్టాడు.  ఇంతకీ ఆ హీరో ఎవరా అంటారా బాలీవుడ్ హీరో జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ఫ్రాఫ్.  గతంలో వర్మ చాలా మంది హీరోలను, ఆర్టిస్టులను టార్గెట్ గా చేసుకుని ట్వీట్లు చేశాడు.  ఒకసారి పవన్ కళ్యాణ్, ఓసారి చిరంజీవి, మహేష్ ఇలా ఎవ్వరినీ వదల్లేదు. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్న టైగర్ ఫ్రాఫ్ ని పట్టుకొని దారుణంగా కామెంట్ చేశాడు.  

అతను గే అని, ట్రాన్స్ జెండర్ అని ట్వీట్ చేశాడు. టైగర్ షర్టు తీసేసి తన శరీర సౌష్టవాన్ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఫోటోలను చూసిన వర్మ అతనిపై అసభ్యంగా ట్వీట్ చేశాడు. అసలై మగవాళ్లు ఇలా షర్టు తీసేసి ఫోజులివ్వరని, కేవలం ‘గే’లు మాత్రమే ఫోజులిస్తారని అన్నారు. తన మాట మీద నమ్మకం లేకపోతే మీ నాన్ననడుగు చెబుతాడు అంటూ టైగర్ ష్రాఫ్ నుంచి అన్నాడు.

దీనిపై జాకీఫ్రాఫ్ ఏమీ స్పందించలేదు కానీ..ఆయన భార్య టైగర్ ఫ్రాఫ్ తల్లి మాత్రం వర్మకు ఘాటుగా సమాధానం ఇచ్చింది.  వర్మ ఓ కుక్క అని సాధారణంగా  ‘కుక్కలు మొరుగుతూనే ఉంటాయి... ఏనుగు మాత్రం ముందుకు సాగుతూనే ఉండాలి’ అని అంది. దీనిపై ఇంకా ఆర్జీవీ స్పందించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: