విజ‌యాలు - స‌వాళ్లు: ఉద్యోగులతో బాబు - ప‌వ‌న్‌కు ఇన్ని ప‌రీక్ష‌లా...!

RAMAKRISHNA S.S.
- ప్ర‌తి నెలా 1నే జీతాలు ఇవ్వక‌పోతే ఉద్యోగుల‌తో తంటాలే
- తక్ష‌ణ‌మే మెగా డీఎస్సీ  నోటిఫికేష‌న్
- బాబు హామీల‌పై ప‌వ‌న్ ఒత్తిళ్లు త‌ప్ప‌వ్‌
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలో కొత్త‌గా కొలువు దీర‌నున్న‌కూట‌మి ప్ర‌భుత్వానికి ఉద్యోగుల నుంచి ప్ర‌ధాన స‌వాళ్లుఎదురు కానున్నాయి. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం త‌మ డిమాండ్లు నెర‌వేర్చ‌లేద‌న్న ఆగ్ర‌హంతో ఉన్న ఉద్యోగులు కూట‌మి స‌ర్కారుకు మెజారిటీ క‌ట్ట‌బెట్ట‌డంలో స‌క్సెస్ అయ్యారు. అయితే.. కీల‌కమైన సీపీఎస్ ర‌ద్దు విష‌యంపై చంద్ర‌బాబుపెద్ద‌గా హామీ ఇవ్వ‌లేదు. కానీ, ఎన్నిక‌ల‌స‌మ‌యంలో మాత్రం నెల నెలా 1నే వేత‌నాలు ఇస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా పింఛ‌ను దారుల‌కు కూడా 1వ తేదీనే పింఛ‌న్లు ఇస్తామ‌ని వాగ్దానం చేశారు. ఈ రెండు హామీల‌ను ఇప్పుడు నెర‌వేర్చాల్సి ఉంది.

వైసీపీ హ‌యాంలో అటు ఉద్యోగుల‌కుజీతాలు. ఇటు రిటైరైన వారికి పింఛ‌న్ల‌ను కూడా స‌కాలంలో ఇవ్వ‌లేదు. దీంతో వారంతా కూడా..జ‌గ‌న్‌కు యాంటీ అయ్యారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే.. స‌మ‌యానికి త‌మ‌కు జీతం రాళ్లు వ‌స్తాయ‌ని భారీగా ఆశ‌లుపెట్టు కున్నారు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో మ‌రోఆరు మాసాల వ‌ర‌కు ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డంలేదు. దీంతో చంద్ర‌బాబుతొలి ఆరు మాసాలు కూడా..ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబుపై ఉన్న అభిమానంతో రెండు మాసాలు ఆగినా..త‌ర్వాత నుంచి త‌మ డిమాండ్ల చిట్టాతో ఉద్యోగులు రెడీ అయ్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

ఇక‌, పీఆర్సీ విష‌యంలోనూ వైసీపీ స‌ర్కారు త‌మ‌ను మోసం చేసింద‌నే భావ‌న ఉద్యోగ వ‌ర్గాల్లో ఎక్కువ‌గా ఉంది. దీంతో ఇప్పుడు దానిని స‌వ‌రించాల‌నే ప్ర‌తిపాద‌న‌ను వారు డిమాండ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఉద్యోగ సంఘాల నాయ‌కులు దీనికి సంబంధిం చిన డిమాండ్‌తో రెడీ అవుతున్నారు.  చంద్ర‌బాబు హ‌యాంలో 2015లో 43 శాతం ఫిట్ మెంట్ ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడు అదేస్తాయిలో త‌మ‌కు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టే అవ‌కాశం ఉంది. ఇక‌, మ‌రో ముఖ్య‌మైన వ్య‌వ‌హారం.. డీఎస్సీ విష‌యం కూడా కూట మి సర్కారుకు ఇబ్బందిగా మారనుంది. తాము అధికారంలోకివ‌స్తే మెగా డీఎస్సీ వేస్తామ‌నిచంద్ర‌బాబుహామీ ఇచ్చారు.

అంతేకాదు.తొలి సంత‌కం కూడా మెగా డీఎస్సీపైనే ఉంటుంద‌ని చెప్పారు. కానీ, ప్ర‌స్తుతం విద్యాశాఖ‌లో పాఠ‌శాల‌లుకానీ, ఉన్న‌త విద్యలో పాఠ‌శాల‌ల్లో కానీ. ఎక్క‌డా ఖాళీలు లేవ‌నితెలుస్తోంది. ఉన్న 4 వేల మందికి వైసీపీ ప్ర‌భుత్వం గ‌త ఏడాది చివ‌ర్లో డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు కొత్త‌గా మెగా డీఎస్సీ వేయాలంటే.. చంద్ర‌బాబుకు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏయే పాఠ‌శాల‌ల‌ను విలీనం చేశారు?  వంటి విష‌యాలు తెలుసుకున్నాక కానీ. నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం లేదు. పైగా ఆర్థిక‌శాఖ నుంచి కూడా అనుమ‌తులు తీసుకోవాల్సి ఉంటుంది. సో.. చంద్ర‌బాబు సంత‌కం చేసినా.. ఫ‌లితం క‌నిపించే స‌రికి మాత్రం ఎంత లేద‌న్నా.. ఆరు మాసాల గ‌డువు ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: