కుమారి 21F : రివ్యూ
హైదరబాద్ లోని కెజిబి కాలనీలో మొదలవుతుంది. అక్కడ ఆడుతూ పాడుతూ, సింగపూర్ లోని స్టార్ క్రూస్ షిప్ లో చెఫ్ గా చేరాలనే లక్ష్యంతో ఉన్న కుర్రాడే మన హీరో సిద్దు(రాజ్ తరుణ్). సిద్డుకి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). వీరు ముగ్గురూ దొంగతనాలు చేస్తూ దర్జాగా బతుకుతూ ఉంటారు. కట్ చేస్తే అదే కాలనీలోకి ముంబై నుంచి మోడల్ అయిన కుమారి(హేభ పటేల్) వస్తుంది. కుమారి మెయిన్ క్వాలిటీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అందరితో ఫ్రెండ్లీగా ఉండడం. అలాంటి కుమారి మొదటి చూపులోనే సిద్దుని ప్రేమిస్తుంది. చాలా షార్ట్ టైంలోనే ఇద్దరూ లవర్స్ అవుతారు. కానీ కుమారి ఓపెన్ గా ఉండడం, అలాగే కుమారి గురించి సిద్దు ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నెగటివ్ గా చెబుతుండడం వలన సిద్దుకి కూడా కుమారి మీద అనుమానం రావడంతో నిలదీస్తాడు. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. అదే టైంలో సిద్దు ఫ్రెండ్స్ కుమారిపై కన్నేస్తారు. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరికి సిద్దు కుమారిలు కలిసారా? లేదా? సిద్దు ఫ్రెండ్స్ కుమారి పై ఏమన్నా అగాయిత్యం చేయడానికి ట్రై చేసారా? లేదా? అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన మిగిలిన కథ.
రాజ్ తరుణ్.. రెండు వరుస హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ పైనే అందరి కన్నూ ఉంది. గత రెండు సినిమాలకి సంబంధంలేని పాత్రలో రాజ్ తరుణ్ కనిపించాడు. కానీ ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర అస్సలు ఎనర్జిటిక్ గా లేదు. ఆ ఎనర్జీ ఎందుకు లేకుండా పాత్రని డిజైన్ చేసారు అన్నదానికి క్లారిటీ లేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే ఎప్పుడూ సీరియస్ గా ఉండడం లేదా మూతి ముడుచుకొని ఉండడం, సెకండాఫ్ లో అన్నా కొన్ని చోట్ల డైలాగ్స్ వలన ఎక్స్ ప్రెషన్ మారింది. ఓవరాల్ గా ఈ సినిమాలో రాజ్ తరుణ్ బెస్ట్ పార్ట్ అంటే క్లైమాక్స్ లో చేసిన ఎమోషనల్ సీన్ ఒక్కటే.. అసలు హీరో పాత్రని ఎందుకంత డల్ గా చూపిస్తున్నాం అనే దానిపై ఒక క్లారిటీ అన్నా ఇవ్వాలి కదా అనేదే నా వాదన.. ఇక హీరోయిన్ హేభ పటేల్ విషయానికి వస్తే.. నటన పరంగా ఓ తిప్పెసుకొని, తెగ ఎక్పోజింజ్ చేస్తుండే తప్ప పర్ఫెక్ట్ ఎక్స్ ప్రెషన్స్ మాత్రం పలికించలేదు. అలాగే తనని చూపించిన విధానం సరిగా లేదు. ఎలా అంటే తనకి ఏ లుక్ అయితే సెట్ అవుతుంది అన్నదానిపై కూడా సరిగా వర్కౌట్ చెయ్యలేదు. ఓవరాల్ గా స్కిన్ షో పరంగా హేభ పటేల్ బాగా రెచ్చిపోయినా, నటనాపరంగా యావరేజ్ అనిపించుకుంది. మిగతా మెయిన్ లీడ్ రోల్స్ చేసిన వారి విషయానికి వస్తే.. నోయెల్ నెగటివ్ షేడ్స్ ని, దానికి తగ్గట్టు డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. ఇక కమెడియన్స్ అయిన నవీన్ - సుదర్శన్ లు తమ మార్క్ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కాస్త నవ్వించడానికి ట్రై చేసారు. హేమ, తాగుబోతు రమేష్ లు తమ పాత్రల్లో పరవాలేధనిపిస్తే.. సెకండాఫ్ లో వచ్చిన సెకండ్ హీరోయిన్ కూడా స్కిన్ షో పరంగా మెప్పించింది.
కుమారి 21F.. చెప్పాలంటే సుకుమార్ రైటర్ గా తనని తాను కించపరచుకోవడానికి రాసిన కథలా ఉంది. ఎందుకంటే సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బ్యూటిఫుల్ వే లో కూడా ప్రెజంట్ చేయచ్చు కానీ ఆయన మాత్రం యువతను ఆకర్షించాలని భూతుపై ఎక్కువ దృష్టి పెట్టి ఈ సినిమాలోని సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలిపాడు. అలా వచ్చే అడల్ట్ సీన్స్ అన్నిటికీ ఒక లింక్ పాడు ఉండదు. వస్తుంటాయి అంటే వస్తుంటాయి మీరే సర్దుకొని చూసేయ్యాలి. ఇకపోతే సుకుమార్ స్టైల్ ఉన్న కథ అయితే ఇందులో కనిపిచ్నఃడు, ఏ మారుతినో, లేక బి గ్రేడ్ డైరెక్టర్ నుంచి కథ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా యువతకు నచ్చే అంశాలు, ఓవర్ స్కిన్ షో చేసే సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా యువతని ఆకట్టుకొని కలెక్షన్స్ మాత్రం బాగా రాబట్టుకుంది. మా సూచన ఒక్కటే.. దయచేసి ఫామీలీ ఆడియన్స్ ఈ సినిమాకి దూరంగా ఉండండి.