బాబుని ఆడేసుకుంటున్న మంచు ఫ్యామిలీ.. 'NARA'కి కొత్త అర్ధం చెప్పిన మంచు విష్ణు..!

shami
ఏపి ఎలక్షన్ లో 151 స్థానాల్లో గెలిచి విజయఢంఖా మోగించిన వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందరి నుండి శుభాకాంక్షల వెళ్లువ మొదలైంది. ఏపిలో జగన్ పాలన సమర్ధవంతంగా సాగుతుందని అందరు నమ్ముతున్నారు. ఇక ఈ ఎలక్షన్స్ ముందు చంద్రబాబుకి యాంటీగా మారి వైసిపి కండువా కప్పుకున్నారు మంచు మోహన్ బాబు.     


బాబు మోసాలు అన్ని ఇన్ని కావంటూ తమకు రావాల్సిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయమై ఎలక్షన్స్ కు ముందు రోడ్డు మీద ధర్నా కూడా చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే జగన్ గెలిచిన తర్వాత కూడా మంచు ఫ్యామిలీ బాబుని వదలడం లేదు. లేటెస్ట్ గా మంచు విష్ణు నారాకి కొత్త అర్ధం చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. 


‘NARA’ - ‘N’ational ‘A’mbition and ‘R’egional ‘A’spirations. I have a strong feeling our beloved PM @narendramodi ji is trolling someone we all know 🤔😉😳

— Vishnu Manchu (@iVishnuManchu) May 26, 2019
ఇంతకీ మంచు విష్ణు ఏం ట్వీట్ చేశాడు అంటే.. NARA (నేషనల్ యామిభిషన్ అండ్ రీజనల్ ఆస్పిరేషన్స్) అంటూ ట్వీట్ చేశాడు. మన పిఎం నారా అని ట్రోల్ చేసింది ఎవరి గురించో మీకు తెలుసుగా అంటూ సెటైర్ వేశాడు. చంద్రబాబు ఇంటి పేరుతో మంచు విష్ణు చేసిన ఈ పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   


ఎలక్షన్స్ ముందునుండి వైసిపికి సపోర్ట్ గా ఉన్న మంచు ఫ్యామిలీ జగన్ గెలిచాడని తెలిసే సరికి ఇంకాస్త రెచ్చిపోతున్నారు. బాబు మీద తమకు ఉన్న కసి అంతా ఇలా ట్వీట్స్ రూపంలో బయటపెడుతున్నారు. మంచు విష్ణు కూడా చంద్రగిరి వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: