అరబ్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య మ్యానియా !

frame అరబ్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య మ్యానియా !

Seetha Sailaja
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాల మార్కెట్ ఒకప్పుడు 25 కోట్లకు మించి ఉండేది కాదు. అయితే బాలయ్యకు వరస హిట్స్ వస్తూ ఉండటంతో ప్రస్తుతం అతడి మార్కెట్ 100 కోట్ల స్థాయిని దాటిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘అఖండ’ మూవీ నుండి వరస హిట్స్ బాలయ్యకు రావడంతో అతడి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.



ప్రస్తుతం బాలయ్యకు పారితోషికం 40 కోట్లవరకు ఇస్తున్నారు అన్న వార్తలను బట్టి ఈ నందమూరి సింహం రేంజ్ ఏవిధంగా పెరిగిందో అర్థం అవుతుంది. తెలుగు రాష్ట్రాలను దాటిపోయి ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన వార్తలు అరబ్ మీడియాలో కూడ కనిపించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇరాక్ లోని ఒక అరబిక్ న్యూస్‌పేపర్‌ లో ‘డాకు మహరాజ్’ పై ఒక వార్త వచ్చినట్లు తెలుస్తోంది. "డాకు మహారాజ్" మూవీలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌ గా ఉన్నదని ప్రశంసిస్తూ ఆ అరబ్ పత్రిక ఒక ఆర్టికల్ వ్రాసినట్లు వార్తలు వస్తున్నాయి.



ఈ మూవీలో బాలయ్య క్యారెక్టర్‌ ను రాబిన్‌హుడ్ తరహాలో డిజైన్ చేశారని సామాజిక విప్లవ నాయకుడిగా చూపిస్తూ మాస్ యాంగిల్‌ లో తీసిన ఈమూవీ చాలబాగుంది అంటూ ఆ అరబ్ పత్రిక తన ఆర్టికల్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనితో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈవార్తను చూసి బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న ‘అఖండ 2’ షూటింగ్ వేగంగా జరుగుతోంది.



ఈ మూవీని అక్టోబర్ లో దసరా పండుగకు విడుదల చేయాలని బోయపాటి చాల గట్టిపట్టుదల పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య గంగానది కి జరిగిన ‘మహా కుంభమేళ’ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను బోయపాటి చాల తెలివిగా ‘అఖండ 2’ లో ఉపయోగించుకుంటున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈమూవీ కూడ సూపర్ హిట్ అయితే బాలయ్య కెరియర్ కు ఈ లేట్ వయస్సులో తిరుగు ఉండదు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: