రాంచరణ్: నా కేరిర్లో పరమ చెత్త సినిమా అదే...బాలయ్య రియాక్షన్ ఏంటంటే.?

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తాము చేసిన ఒకటి రెండు సినిమాలు ప్లాపులు అయితే తమ చేతులారా తామే తప్పు చేశామని కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకొని బాధపడుతూ ఉంటారు.అంతేకాదు ఈ విషయాలను కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో బయటపెట్టి బాధపడతారు.అలా రామ్ చరణ్ కూడా తాను ఓ సినిమాలో నటించి అతిపెద్ద తప్పు చేశాను అంటూ రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో లో ఈ విషయాన్ని బయట పెట్టారు.అంతేకాదు నా కెరీర్ లోనే అది పెద్ద డిజాస్టర్ అని,అసలు ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అంటూ రాంచరణ్ చెప్పుకోచ్చారు. మరి ఇంతకీఅన్ స్టాపబుల్ షోలో రాంచరణ్ ఏం చెప్పారయ్యా అంటే బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాను నేను తెలుగులో తుఫాన్ పేరుతో రీమేక్ చేశాను కానీ నా కెరియర్ లో చేసిన అతి పెద్ద తప్పు ఇదే.ఆ సినిమా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది. ఆ సినిమా డిజాస్టర్ ఫలితం నా కెరీర్ పై కొంత చూపెట్టింది. ఇప్పటికి కూడా ఆ సినిమాలో ఎందుకు నటించానా అని బాధ పడుతుంటాను అంటూ రాంచరణ్ చెప్పుకోచ్చారు.

దీంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లాలనే కలలు కనలేదు రామ్ చరణ్. 2013లో విడుదలయిన జంజీర్ గురించి ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయారు కూడా.ఇక హిందీ జంజీర్ మూవీ ని తెలుగులో తుఫాన్ పేరుతో అపూర్వ లకియా దర్శకత్వం వహించగా రాంచరణ్ సరసన గ్లోబల్ బ్యూటీ అయినటువంటి ప్రియాంక చోప్రా నటించింది.ఈ క్రమంలో నే 1973లో జంజీర్  అనే టైటిల్‌తో అమితాబ్ బచ్చన్ సినిమా ఒకటి వచ్చింది. దానినే 2013లో రీమేక్ చేశాడు రామ్ చరణ్. బాలీవుడ్ ప్రేక్షకులకు జంజీర్ అనేది కల్ట్ క్లాసిక్‌గా గుర్తుండిపోయింది. అదే మూవీని మళ్లీ రీమేక్ చేయడం, అప్పటివరకు రామ్ చరణ్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవడం వల్ల ఈ మూవీ పెద్ద డిశాస్టర్‌గా నిలిచింది. దాని తర్వాత మళ్లీ ఆర్ఆర్ఆర్ తోనే బీ టౌన్‌లో అడుగుపెట్టాడు ఈ మెగా హీరో. అప్పుడు మాత్రం సక్సెస్ తనను వరించింది.ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ కు కూడా బీ టౌన్‌లో బాగానే బజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: