భక్తుల కుటుంబాలకు పరిహారం లేదా బాబు.. టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి?
ఈ నెల 10, 11, 12 తేదీలకు కలిపి మొత్తం లక్షా 20 వేల టోకెన్లను జారీ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రక్రియను మొదలుపెట్టునున్నట్టు ప్రకటించడం జరిగింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు నిన్న సాయంత్రానికి పోగయ్యారు. మొత్తం నాలుగు ప్రాంతాలలో తొక్కిసలాట జరిగిందని సమాచారం అందుతోంది.
రాత్రి 7 గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లలో ప్రవేశించారని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితులను అదుపులోకి తెచ్చారని సమాచారం అందుతోంది. తోపులాటకు దారి తీసిన కారణాల విషయంలో టీటీడీ అధికారులు భక్తుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలుస్తోంది.
0877 2236007 నంబర్ ద్వారా క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తిరుపతి ఘటన గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. భక్తుల కుటుంబాలకు పరిహారం అందించేలా బాబు అడుగులు వేస్తారేమో చూడాలి. టీటీడీ చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘటన జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒకింత షాక్ కు గురి చేసింది.