జగన్‌ రూట్లో రేవంత్‌రెడ్డి.. హరీశ్‌రావు షాకింగ్‌ కామెంట్స్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల అమ్మకాలు నిలిపివేయాలని యునైటెడ్ బ్రీవరీస్ తీసుకున్న నిర్ణయం తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. బీర్లకు సంబంధించిన బకాయిలను బీవరేజ్ కార్పోరేషన్ చెల్లించలేదని యునైటెడ్ బ్రీవరీస్ పేర్కొంది. బీర్ల విక్రయాలను నిలిపివేస్తే రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హీనెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్ల లభ్యతకు అంతారయం కలుగుతుందని అంతా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కింగ్‌ ఫిషర్‌ బీర్లు ఆగిపోతే..బూంబూం, బిర్యానీ వంటి స్థానిక బ్రాండ్లు రెచ్చిపోతాయని.. ఇలాంటి బీర్లను ప్రోత్సహించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమా అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఏపీలో కూడా ఇలాగే జరిగిందన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. బిల్లుల చెల్లింపులో వరుస క్రమాన్ని కాకుండా ప్రత్యేక ప్రాధాన్యతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: