"అక్కినేని ఫ్యామిలీలో ఇక అది కనిపించదు"..సమంత చివరి తీపి జ్ఞాపకాన్ని కూడా తీసేసిన శోభిత ధూళిపాళ్ల..!?

Thota Jaya Madhuri
సమంత - నాగచైతన్య విడిపోయారు . వీళ్లు విడిపోయి కూడా చాలా కాలమే అవుతుంది . కానీ వీళ్ళిద్దరి పేర్లను పక్క పక్కన కలిపి చదివితేనే చూసి ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు . సమంత - నాగచైతన్యకు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు అన్న విషయం గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  చాలా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఈ జంటకి.  కానీ ఏ కారణంగా విడాకులు  తీసుకున్నారో తెలియదు కానీ వీళ్ళు మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఇప్పుడు దూరం దూరంగా ఉంటున్నారు .


రీసెంట్ గానే నాగచైతన్య రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు నాగచైతన్య.  అంతే కాదు వీళ్ళు అక్కినేని నాగార్జునతో కాకుండా సపరేట్గా ఫ్యామిలీ కూడా పెట్టేశారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.  అయితే ఇదే మూమెంట్లో నాగచైతన్య - సమంత ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇల్లు లోనే వీళ్ళు ఇప్పుడు కొత్త కాపురం పెట్టారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే నాగచైతన్య - సమంత విడాకులు తర్వాత తన ప్రతిజ్ఞపకాన్ని కూడా అక్కడ నుంచి తీసేసారు అన్న వార్తలు విన్నం.


తాజాగా సమంత చివరికి జ్ఞాపకంగా మిగిలిన టెర్రస్ గార్డన్నింగ్  కూడా రీసెంట్గా శోభిత ధూళిపాళ్ల క్లీన్ చేసింది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . సమంతకి గ్రీనరీ అన్నా.. గార్డెనింగ్ అన్న చాలా చాలా ఇష్టం. ఇంట్లోనే టెర్రస్ గార్డన్నిం లాంటిది పెట్టుకుంది . ఆ విషయం కూడా అందరికీ తెలుసు. అయితే శోభిత ఆ గార్డనింగ్ తీసేసి ఆమెకు కావాల్సిన విధంగా అక్కడ తన ఇష్టాలు తగిన్నట్లు డిజైన్ చేసుకుందట . దీంతో నాగచైతన్య - సమంత చివరి ప్రేమ జ్ఞాపకం కూడా తుడిచిపెట్టుకుపోయినట్లు అయింది . ఇదే విషయం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. కాగా నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత ధూళిపాళ్ల రేంజ్ వేరే లెవెల్ లోకి వెళ్లిపోయింది . ఇప్పుడు ఆమెను ఎక్కడ చూసినా ఒక హీరోయిన్గా కాదు అక్కినేని ఇంటికి కోడలుగా నాగచైతన్య భార్యగానే ట్రిట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: