క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీలో అనూహ్య పరిణామాలు.?

FARMANULLA SHAIK
మెగా వారసుడుగా రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక 2012 లో చరణ్.. ఉపాసన కామినేని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి తరువాత చరణ్ లక్ మారిపోయింది. ఉపాసన.. మెగా కోడలుగా, మంచి భార్యగా, అపోలో అధినేతగా అన్ని చక్కదిద్దితూ మంచి పేరు తెచ్చుకుంది.పెళ్లి రోజు ఆమె లుక్స్ ను విమర్శించిన వారే.. ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధులు అయ్యి అభిమానులుగా మారారు. ఇక 11 ఏళ్లు అయినా కూడా ఈ జంటకు పిల్లలు లేకపోవడంతో దాన్ని కూడా విమర్శించారు. ఉపాసనకు ఇక పిల్లలు పుట్టరనీ ట్రోళ్ళ చేశారు. ఆ ట్రోల్స్ ఆ జంటను ఎంత బాధపెట్టినా కూడా వారు మారు మాట్లాడకుండా తాము అనుకున్నదాని మీద నిలబడ్డారు.అలా గతేడాది డిసెంబర్ లో ఉపాసన.. తాను ప్రెగ్నెంట్ అని అధికారికంగా తెలిపింది. ఇక ఉపాసన తల్లి కాబోతుంది అని తెలిసినప్పటి నుంచి చరణ్.. ఆమెను ఒక్క నిమిషం కూడా వదలకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు. 2023  జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్లింకారా రాకతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ చిన్నారి పుట్టడంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. అంతేనా మెగా ఇంటికి అదృష్టమే ఈ చిన్నారి రూపంలో వచ్చింది.

ఆమె ఇంటికి వచ్చిన ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీ లో అన్ని మంచి శుభాలే జరిగాయి.మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం అలాగే పదేళ్ల పోరాటం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మేల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం అన్ని క్లింకారా వచ్చిన తర్వాత జరిగాయంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.అలాగే క్లింకారా తల్లి గర్భంలోనే ఉండగా రాంచరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ప్రపంచ ప్రఖ్యాత 'ఆస్కార్' అవార్డ్ లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలవగా రాంచరణ్ క్రేజ్ శిఖరాగ్రాన్ని చేరింది. నాటి నుంచి ఆయన గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు.ఈ క్రమంలోనే క్లింకారా పుట్టిన వేళా విశేషంతోనే మెగా ఫ్యామిలీకి ఈ శుభకార్యాలు, ఘన విజయాలు, అవార్డులు, రివార్డులు క్యూ కడుతున్నాయని ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరు భావిస్తున్నారు.ఇదిలావుండగా క్లింకారా ఫేస్ ఇప్పటి వరకు చూపించకపోవడం ఆశ్చర్యకరం. ఇదే విషయం పై తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రాంచరణ్ ని అడుగగా చరణ్ దానికి క్లింకారా ఎప్పుడైతే తనని నాన్న అని పిలుస్తుందో అప్పుడు తప్పకుండ చుపిస్తా అని బాలకృష్ణ తో చెప్పడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: