తన లవ్ గురించి నిజాలు బయటపెట్టిన నిఖిల్

MADDIBOINA AJAY KUMAR
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్, కావ్య శ్రీ ప్రేమ గురించి పరిచయం అనవసరం. వీరిద్దరూ స్టార్ మా లో ప్రసారం అయ్యే గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అందరి మనసు దోచుకున్నారు. నిఖిల్, కావ్య వారి నటనతో తెలుగు వారిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. అంతేకాదు నిఖిల్, కావ్య స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవారు. ఇక నిఖిల్, కావ్య లవ్ లో ఉన్నారని.. ప్రతి షోలో కనిపించేది. బయట కూడా వాళ్లు ఎప్పుడు కలిసే తిరిగేవాళ్లు. 

అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయింది. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని అన్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. కానీ నిఖిల్ హౌస్ నుండి బయటికి వచ్చి రోజులు గడిచాయి కానీ తాను కావ్య శ్రీ కలవడానికి వెళ్లలేదు. ఇక ఇటీవల ఓ షోలో వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆ షోకి శ్రీముఖి కి యాంకర్ అవ్వడంతో పలు విధాలుగా కావ్యని, నిఖిల్ ని కలపడానికి ప్రయతించినప్పటికి  కావ్య, నిఖిల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.  

బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిలిచిన నిఖిల్ మాలియక్కల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన ప్రేమ గురించి అడిగితే.. మన దగ్గరికి రావాలని రాశి పెట్టి ఉంటే, కచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు. మనం ప్రేమించిన వాళ్ల కన్న.. మనల్ని ప్రేమించే వాళ్లని ఎంచుకోవలని చెప్పుకొచ్చాడు. ప్రేమ అంటే అర్దం చేసుకోవాలని.. తప్పు ఒప్పులు అన్నీ స్వీకరించగలగలి అని నిఖిల్ తెలిపారు. ఇక ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి నిఖిల్ గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: