తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈనెల 22వ తేదీన అంటే నిన్నటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సమాధానం చెప్పాల్సింది స్పీకర్ గడ్డం ప్రసాద్. కానీ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించలేదు.
తనకు పట్టనట్టే వ్యవహరించారు. దీంతో సీరియస్ అయిన సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆ వెంటనే దీనిపై స్పందించి సమాధానం ఇవ్వాలని తాజా నోటీసుల్లో మరోసారి పేర్కొంది సుప్రీం కోర్టు. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. కానీ పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోలేదు.
దీంతో ఈ కేసును హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లింది ఈ గులాబీ పార్టీ. హైకోర్టులో గులాబీ పార్టీకి న్యాయం జరగలేదు కానీ సుప్రీంకోర్టులో... గులాబీ పార్టీ అనుకున్నది సాధిస్తుంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో పది ఉప ఎన్నికలు ఖాయమని తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై గడ్డం ప్రసాద్ చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఉప ఎన్నికలు కాయం. దానికి తగ్గట్టుగానే తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం... చర్చనీయాంశమైంది. ఏ క్షణమైనా దీనిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు.