తిరుప‌తి తొక్కిస‌లాట‌.. మినిట్ టు మినిట్ ఏం జ‌రిగింది..?

RAMAKRISHNA S.S.
- ( తిరుప‌తి - ఇండియా హెరాల్డ్ )

తిరుపతి ఘటన ఒక్కసారిగా అందర్నీ తీవ్రంగా కలిసి వేసింది. టికెట్ల కోసం బుధవారం సాయంత్రానికే ఎక్కువమంది అక్కడికి చేరుకోవడంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పోలీసులు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి రాత్రి 8.20 గంటలకి అక్కడ నుంచి క్యూ లైన్ లో అనుమతించారు. ప్రధాన గేటు వద్ద ముందుగా వెళుతున్న భక్తుల మధ్య తోపులాటలో పలువురు కింద పడిపోయారు. దీంతో ఒక్కసారిగా ఘోరం జరిగింది. కొంత సేపు భక్తులకు క్యూలైన్లోకి అనుమతించకుండా .. నిలిపివేసి సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో ప్రాణ నష్టం తగ్గింది. తిరుపతిలోని పలు టోకెన్ జారీ కేంద్రాల వద్ద రోడ్లపై భారీ కేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. బైరాగి పట్టెడలో అందుకు భిన్నంగా వ్యవహరించడమే తొక్కిసలాటకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కౌంటర్ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డిఎస్పి రమణకుమార్ కు రహదారి పొడవున భారీకేడ్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్టు సమాచారం.

10 - రామానాయుడు ఉన్నత పాఠశాల కౌంటర్ వద్దకు పెరిగిన భక్తులు తాకిడి శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతి.
2 - భక్తులతో నిండిన పార్కు .. అదుపు చేసేందుకు భారీగా పార్కుకు చేరిన పోలీసులు.
7- పూర్తిగా పార్కు నిండిపోవడంతో ఎటు కదలలేని పరిస్థితి .. భక్తులకు తాగునీరు అందించిన పోలీసులు 8.20 - భారీగా పెరిగిన భక్తులు... ప్రతి పార్కు నుంచి టిక్కెట్ల జారీ కౌంటర్లోకి అనుమతి .. భక్తుల మధ్య తోపులాటలో పలువురు కింద పడిపోగా వారిపై నుంచి భక్తుల పరుగులు తీయడంతో ప్రాణాపాయం చోటుచేసుకుంది.
8.40 - సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్సులు .. గాయపడిన భక్తుల తరలింపు విషయం తెలుసుకున్న ఎస్పీ సుబ్బారాయుడు సిబ్బందితో అక్కడికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
9.27 - టిటిడి ఈవో శ్యామలరావు జేఈవో వీరబ్రహ్మం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
9.30 - పార్క్ లోని భక్తులందరిని క్యూ పద్ధతుతి లో లోప‌ల‌కు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: