డాకు మహారాజ్ : తిరుమల ఘటనతో బాలయ్యకు షాక్ ?

Veldandi Saikiran
తిరుమల శ్రీవారి సంఘటన హీరో నందమూరి బాలయ్యకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇవాళ అనంతపురంలో జరగాల్సిన... ఈవెంట్ రద్దు అయ్యేలా చేసింది. తాజాగా నందమూరి బాలయ్య డాకు మహారాజ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ నందమూరి బాలయ్య హీరోగా చేసిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్.. చాలా వేగంగా జరుగుతున్నాయి.
 అయితే ఈ సినిమా ప్రమోషన్స్ చేసేందుకు మూడు ఈవెంట్లను ప్లాన్ చేసింది చిత్ర బృందం. మొన్నటికి మొన్న డల్లాస్ లో.... డాకు మహారాజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు నందమూరి బాలయ్య. అలాగే తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... కూడా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఇవాళ అనంతపురంలో... నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజ్... ఫ్రీ రిలీజ్ ఈవెంట్   నిర్వహించేందుకు మొన్నటి నుంచి కసరత్తులు చేశారు.
 బాలయ్య కూడా ఇవాళ ఏపీకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే బుధవారం రాత్రి తిరుమల శ్రీవారి సన్నిధిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట కారణంగా ఏకంగా ఆరుగురు మరణించారు. మరో 30 మంది ఆసుపత్రి పాలయ్యారు. అందులో కొంతమంది చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో... డాకు మహారాజ్ సినిమా బృందం సంచలన నిర్ణయం తీసుకుంది.
 అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. తిరుమలలో జరిగిన తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో ఈవెంట్ రద్దు చేసుకున్నట్లు తెలిపింది. ఇక నేరుగా హైదరాబాదులోనే ఈవెంట్ జరగనుంది. దీంతో నందమూరి బాలయ్య అభిమానులు షాక్ తిన్నారు. అయితే ఇవాళ అలాంటి సంఘటన జరిగిన తర్వాత... డాకు మహారాజు లాంటి ఈవెంట్ కు... పర్మిషన్ లేదని ఏపీ పోలీసులు తేల్చి చెప్పారట. అందుకే చిత్ర బృందం వెనక్కి తగ్గినట్లు సమాచారం.
hi

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: