బుల్లితెర నటుడు, బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తనపై వస్తున్న థంబ్ నెయిల్స్ పై ఫైర్ అయ్యాడు. తాజాగా బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన నిఖిల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యూస్ కోసం సంబంధం లేని థంబ్ నెయిల్స్, టైటిల్స్ పెట్టే యూట్యూబ్ ఛానళ్లపై మండిపడ్డారు. వ్యూయర్స్‌ను తప్పుదోవ పట్టించేలా పెడుతున్న థంబ్ నెయిల్స్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే తనతో పాటు బిగ్ బాస్ హౌస్ కి సంబంధం లేని వాళ్ల పేర్లను కూడా ఆ థంబ్ నెయిల్స్ లో ఉపయోగించడం తప్పని అన్నారు. ఏదైనా ఉంటే నా పేరు మాత్రమే పెట్టుకోవాల్సిందని తెలిపారు. అనవసరంగా ఇతరులను ఇందులోకి లాగి వారి ప్రైవేట్ లైఫ్ లో సమస్యలు వచ్చేలా చేయకండని నిఖిల్ చెప్పారు. ఇక ఇవి ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకొనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు కన్నడ బ్యాచ్ అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా నిఖిల్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు మెచ్చి ఓట్లు వేశారు కాబట్టే తాను గెలిచాడాని నిఖిల్ చెప్పుకొచ్చారు. తాను భారతీయుడనని.. అలాగే మీ తెలుగు వాడనని తెలిపారు. మీ అందరి ప్రేమకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని నిఖిల్ అన్నారు.
ఇక నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ లో కావ్య శ్రీ నటించింది. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు.