నిన్న రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీ ఎత్తున తొక్కేసలాట జరగడంతో ఆరుగురు మృతి చెందిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే కొంత మంది అస్వస్థతకు గురి అయ్యారు. ఇక మొదట కేవలం ఒక మహిళ మాత్రమే మృతి చెందింది. కొంత మందికి గాయాలు అయ్యాయి అని వార్తలు వచ్చాయి. దానితో జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఆ తర్వాత మృతుల సంఖ్య ఆరుకు చేరడంతో అసలు తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఏం జరిగింది అనే విషయంపై జనాలు ఒక్క సారిగా ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు.
వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం పెద్ద ఎత్తున జనాలు రావడంతో , ఒక్క సారిగా టికెట్ కౌంటర్ గేట్లు తెరవడంతో జనాలు అందరూ భారీగా ఉండడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందినట్లు చాలా మంది కి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఆరుగురు మృతి చెందడానికి ప్రధాన కారణం భారీ తొక్కేసలాట అని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా తిరుపతి దేవస్థానం వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందడం , కొంత మంది అస్వస్థతకు గురికావడంతో టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు స్పందించారు.
బి ఆర్ నాయుడు తాజాగా తిరుపతి ఘటనపై స్పందిస్తూ ... తిరుపతి దేవస్థానం తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు నష్టపరిహారాన్ని ప్రకటిస్తాడు అని టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై చాలా సీరియస్ అయ్యారని ఆయన చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న డిఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులందరూ దుసుకురావడం వల్ల ఈ ఘటన జరిగింది అని , ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు బి ఆర్ నాయుడు పేర్కొన్నారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనం 19 వ వరకు ఉంటుంది అని కూడా ఆయన వెల్లడించారు.