లోకేశ్‌ తీరుపై బాబుకు ప్రధాని మోదీ కంప్లయింట్‌?

Chakravarthi Kalyan
విశాఖ పట్నం ప్రధాని సభలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వేదిక పైకి వెళ్లే ముందు గ్రీన్ రూం లో ప్రధానిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న మంత్రులను ప్రధాని మోదీ కలిశారు. ప్రధాని అక్కడికి రాగానే అందరూ ప్రధానికి నమస్కరించారు. వారందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్లిన ప్రధాని మోదీ నారా లోకేష్ వద్దకు వచ్చి ఆగారు.

ప్రధానికి నారా లోకేష్‌ నమస్కరించిన వెంటనే నీ మీద ఒక కంప్లయింట్ ఉందని నారా లోకేష్ తో ప్రధాని మోదీ అన్నారు. ఆ కంప్లయింట్ ఏంటో మీకు తెలుసు కదా అని పక్కనే ఉన్న చంద్రబాబు వైపు చూసి చమత్కరించిన మోదీ.. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయ్యింది.. ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదని నారా లోకేష్‌ను ప్రశ్నించారు. ఒక్కసారి ఫ్యామిలీతో పాటు వచ్చి నన్ను కలువు అంటూ ప్రధాని మోదీ లోకేష్ భుజం తట్టారు. దీంతో రిలీఫ్‌గా ఫీలైన నారా లోకేష్ త్వరలోనే వచ్చి కలుస్తా సార్ అన్నారు. ఈ ఇరువురి మధ్య సంభాషణను మంత్రులంతా ఆసక్తిగా గమనించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: