ప్రూఫ్ లేకుండా ఎలా మాట్లాడతారు... బిగ్ బాస్ బ్యూటీ ఫైర్
ఇక తాజాగా ప్రేరణ కంబం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ప్రేరణ కన్నడ బ్యాచ్ అంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్టార్ మా వాళ్లు నిఖిల్‌కి ఏమైనా చుట్టమా? లేదంటే.. స్టార్ మా వాళ్లు నిఖిల్‌కి తండ్రా తల్లా? అంటూ ప్రశ్నించింది. నిఖిల్ కంటే గౌతమ్‌కి ఓట్లు ఎక్కువ వచ్చాయని.. నిఖిల్ కే బ్యాచ్ కాబట్టి.. సీరియల్ బ్యాచ్ కాబట్టి అతన్ని విన్నర్‌ని చేశారని అందరూ అంటున్నారని ఆమె మండిపడింది. అలా అనడానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకుండా అలా ఎలా మాట్లాడతారని ప్రేరణ ఫైర్ అయ్యింది. వీళ్లు విన్నర్ కాదు.. వేరే వాళ్లు విన్నర్ అని ఎలా చెప్తారని.. మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ఇలాంటి వాటి గురించి మాట్లాడండి అని చెప్పుకొచ్చింది.
అలాగే స్టార్ మాలో ఎవరు ఎవరికీ రిలేషన్ కాదని చెప్పింది. అలా అనుకుంటే.. గౌతమ్ తెలుగు వాడు, నిఖిల్ కన్నడవాడు స్టార్ మా ఎందుకు బయటవాడ్ని విన్నర్‌ని చేస్తుందని తెలిపింది. తెలుగులో సీరియల్స్ చేస్తున్నాం కాబట్టి.. మేం కూడా తెలుగు వాళ్లమే అంటూ ప్రేరణ మాట్లాడింది.