పవన్ .. తిరుపతి తొక్కిసలాట మరణాలు ఎవరి ఖాతాలో వేస్తావ్..?

Amruth kumar
ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి ప్రమాదానికి, దుష్ప‌రిణామానిల‌కి జగన్ ప్రభుత్వమే కారణమని కూటమి ప్రభుత్వ పెద్దలకు చెప్పటం అలవాటైపోయింది .. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వైఎస్ జగన్ పై విమర్శలు చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .. ఇక రీసెంట్గా తన అన్న కుమారుడు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం లో ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే .

ఇక దీనికి జగన్ ప్రభుత్వం రోడ్లు వేయకపోవటమే కారణమని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు .. ఇక రామ్ చరణ్ అభిమానుల మరణాలను జగన్ ప్రభుత్వం ఖాతాలో  వేయడం పవన్ కే చెల్లిందని విమర్శలు కూడా వచ్చాయి .. ఇప్పుడు తిరుపతి లో వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల కు వచ్చిన భక్తుల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు .. ఆరుగురు భ‌క్త‌లు చనిపోగా మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు . ఇక ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరి ఖాతలో వేస్తున్నారు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ భక్తులు , రాజకీయవేత్తలు నిలదీస్తున్నారు .

ఇప్పటివరకు ప్రతిదానికి జగన్ ప్రభుత్వమే కారణం అంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేస్తూ వచ్చారు .. ఇక ఎప్పుడూ భక్తులకు కనీసం దర్శనం టికెట్లు జారీ చేయడం లో కూడా ఇంత వైఫల్యం చెందడాన్ని ఎలా సమర్థించుకుంటారనేది  చూడాలి. అలాగే సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ .. టిటిడి చరిత్రలో ఎప్పుడు జరగని ఇలాంటి ఘోరమైన విషాదం చోటు చేసుకోగా కనీసం అక్కడికి వెళ్లే మంత్రుల కమిటీలో ఆయన లేకపోవడం అందరికి  షాక్ ను కలిగిస్తుంది .. తొక్కిసలాట ఘటనలో భక్తుల మరణాలకు కారకులు ఎవరో తేల్చి వారిపై కఠిన చర్యకులు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం పై ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: