గేమ్ ఛేంజర్ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
"గేమ్ ఛేంజర్" ఒక పాన్-ఇండియా చిత్రం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం మొదట శంకర్ తమిళ స్టార్ విజయ్‌ను సంప్రదించారట. విజయ్‌కి కథ నచ్చడంతో అంగీకరించాడని సమాచారం. అయితే, శంకర్ షూటింగ్ కోసం ఏడాదిన్నర సమయం అడగడంతో, విజయ్ అంత సమయం కేటాయించలేకపోవడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత శంకర్ ఈ పాత్ర కోసం రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు.
ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. అంజలి, సముద్రఖని, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ చరణ్ గత చిత్రం "ఆచార్య" బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో, ఈ సినిమాపై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నారు. "గేమ్ ఛేంజర్" బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. శంకర్ టేకింగ్‌తో ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు.