కెనడాలో దూసుకుపోతున్న పుష్ప-2...ఆల్ టైం రికార్డ్.?
ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.ఇదిలా ఉంటే 'పుష్ప 2' జోరు మున్ముందు ఇంకా ఉండొచ్చని అనుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. మేకర్స్ అయితే 2000 కోట్ల వరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు. హిందీలో ఈ సినిమా ఎంత కాలం వసూళ్ల పర్వం కొనసాగిస్తుందనే దానిని బట్టి ఈ లాంగ్ రన్ వసూళ్లు ఆధారపడి ఉంటాయని అనుకుంటున్నారు.'పుష్ప 2' మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశ గా దూసుకెళ్తూ ఉండటంతో భవిష్యత్తు లో అల్లు అర్జున్ నుంచి రాబోయే అన్ని సినిమాలు 1000 కోట్లకి పైగానే వసూళ్లు చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.