బాలయ్య.. కెఎస్ రవికుమార్ కాంబోలో మిస్ అయిన మూడో మూవీ ఏదో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇక తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో కె ఎస్ రవికుమార్ ఒకరు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , కే ఎస్ రవి కుమార్ కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో మొదటగా జై సింహ అనే మూవీ వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమా సూపర్ కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత విరి కాంబోలో రూలర్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే వీరి కాబ్లో ఓ మూవీ మిస్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం కే ఎస్ రవి కుమార్ , రజనీ కాంత్ హీరోగా కథానాయకుడు అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రజనీ కాంత్ కి స్నేహితుడి పాత్రలో జగపతి బాబు నటించాడు. ఈ పాత్ర కోసం మొదట కె ఎస్ రవి కుమార్ , జగపతి బాబు ను కాకుండా బాలకృష్ణ ను అనుకున్నాడట.

అందులో భాగంగా బాలకృష్ణ ను కలిసి కథను కూడా వివరించగా ఆయన ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల రజనీ కాంత్ హీరోగా రూపొందిన కథానాయకుడు సినిమాలో తన స్నేహితుడి పాత్రలో నటించడానికి బాలయ్య నో చెప్పాడట. దానితో కే ఎస్ రవి కుమార్ ఆ పాత్రలో జగపతి బాబు ను తీసుకున్నాడట. అలా ఆల్మోస్ట్ బాలకృష్ణ , కె ఎస్ రవి కుమార్ కాంబోలో కథానాయకుడు సినిమాలో ఓ పాత్ర సెట్ అయినా కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఇది క్యాన్సిల్ అయ్యిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: