ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఆ హ్యాబిట్ ఉందనే విషయం మీకు తెలుసా..?
వెంకటేష్: ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన అందరి చేత వెంకీ మామ అని పిలిపించుకుంటూ ఉంటాడు . త్వరలోనే ఈయన నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కాబోతుంది . వెంకటేష్ పైకి కనిపించడు కానీ ఫ్రెండ్షిప్ కి బాగా వాల్యూ ఇస్తాడు . గతంలో ఫ్రెండ్షిప్ పేరిట ఎన్నో కోట్లు కూడా నష్టపోయాడట.
ప్రభాస్: రెబల్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ సైతం ఫ్రెండ్షిప్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తారు . ఆ విషయం అందరికీ తెలిసిందే . అంతే కాదు ఫ్రెండ్స్ మోసం చేసిన సరే మళ్లీ వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు . అంతేకాదు ప్రభాస్ మంచితనాన్ని చాలామంది మోసం చేసే విధంగా కూడా తీసుకుంటూ ఉంటారట.
నాగచైతన్య: నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . రీసెంట్ గానే శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నాడు . కాగా నాగచైతన్య సైతం ఫ్రెండ్షిప్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తాడు . అయితే కనిపించిన ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేయరు కానీ ఫ్రెండ్షిప్ చేసిన ఇద్దరు ముగ్గురిని బాగా నమ్మేసి లైఫ్ లాంగ్ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలి అంటూ ముందుకెళ్తూ ఉంటాడట.
జూనియర్ ఎన్టీఆర్ : ఫ్రెండ్ షిప్ కి తారక్ ఎంత వాల్యూ ఇస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో స్పెషల్ పర్సన్ తారక్ పేరు చెప్పుకొని జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి తారక్ ని అదే విధంగా ఆయన నమ్మిన జనాలని మోసం చేశాడు అంటూ వార్తలు వినిపించాయి . అప్పటినుంచి అతనిని దూరం పెట్టేసాడట తారక్. అయితే ఆయన మోసం చేశాడు కదా అని పక్క ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తాడు అని ఎప్పుడు తారక్ అనుకోలేదు. తారక్ కి ఉండాల్సిన ఫ్రెండ్స్ తారక అలాగే మైంటైన్ చేస్తున్నారు..!