అన్నయ్య లవర్ ని ప్రేమించా.. అందుకే బ్రేకప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్?

Pandrala Sravanthi
ఏంటి అల్లరి నరేష్ అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని ప్రేమించారా.. ఇదెక్కడి విచిత్రం.. అన్నయ్య ప్రేమిస్తున్నాడు అనే విషయం అల్లరి నరేష్ కి తెలియదా.. ఎందుకు అలాంటి తప్పు పని చేశాడు అనుకుంటారు ఈ  విషయం తెలిసిన చాలా మంది జనాలు. అయితే రియల్ లైఫ్ లో అయితే అల్లరి నరేష్ ఈ పని చేసి ఉండడు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది రీల్ లైఫ్ లో కాబట్టి. అవును మీరు వినేది నిజమే.. అల్లరి నరేష్ ఆర్యన్ రాజేష్ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు.ఇక ఇప్పటికే మీకు ఆ సినిమా పేరు ఏంటో గుర్తుకు వచ్చే ఉంటుంది. అదేనండి నువ్వంటే నాకిష్టం మూవీ.. ఈ సినిమాలో హీరోయిన్గా అనురాధ మెహతా నటించగా ఈ హీరోయిన్ ని అటు అల్లరి నరేష్ తో పాటు ఇటు ఆర్యన్ రాజేష్ ఇద్దరు ప్రేమిస్తారు.

అయితే ఆర్యన్ రాజేష్ కంటే ముందు అల్లరి నరేష్ అనురాధ మెహతా ఇద్దరు ప్రేమలో పడతారు. కానీ అల్లరి నరేష్ దగ్గర డబ్బు లేకపోవడంతో డబ్బు సంపాదించడానికి వెళ్లి మళ్లీ మారువేషంలో ఊరికి వస్తారు. ఇక అప్పటికే హీరోయిన్ కి ఆర్యన్ రాజేష్ తో పెళ్లి సెట్ చేస్తారు. దాంతో అలా మారు వేషంలోనే చాలా రోజులు తిరుగుతాడు.కానీ చివరికి అల్లరి నరేష్ కి అనురాధ మెహతాతోనే పెళ్లి జరుగుతుంది. అయితే ఈ సినిమాలో అన్నదమ్ములు ఇద్దరు అంటే ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ ఇద్దరు కలిసి నటించడంతో సినిమాపై అందరూ అంచనాలు పెట్టుకున్నారట.ఇక 2005లో విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది.

దానికి కారణం కూడా రియల్ లైఫ్ లో అన్నదమ్ములైన వీళ్లిద్దరూ సినిమా లో ఓకే అమ్మాయిని ప్రేమించడం వల్ల చాలామంది ఈ సినిమాని ఛీ కొట్టారట. అందుకే ఈ మూవీ డిజాస్టర్ అయింది అంటూ అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ సినిమా ప్రమోషన్స్ సమయంలో బయట పెట్టారు. అలాగే ఆర్యన్ రాజేష్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి మళ్ళీ మీ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందా అని అడగగా అన్నయ్య సెంటిమెంట్ తో ఏదైనా స్టోరీ ఉంటే కచ్చితంగా ఇద్దరం మళ్ళీ కలిసి చేస్తాం అని చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: