జై హనుమాన్ సినిమా పై క్లారిటీ.. ప్రశాంత్ ఏం చేస్తాడో..!?

Anilkumar
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమాలల్లో హనుమాన్ కూడా ఒకటి.. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  డైరెక్టర్ గా తెరకెక్కించారు.. తేజా సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో వచ్చింది. హనుమాన్ స్టోరీ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ మూవీకి నిరాజనం పలికారు. ఒకటి, రెండు కాదు ఏకంగా 300 కోట్లకు పైగా రాబట్టింది.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది.. ఇక మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడం తో సెకండ్ పార్ట్ ను ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి

 అప్డేట్ రాలేదు. ఇటీవల ప్రశాంత్ వర్మ స్పెషల్ గ్లింప్స్ కూడా షేర్ చేశారు. చుట్టూ అందమైన కొండలు.. మధ్యలో నది.. ఎంతో ఆహ్లాదమైన వాతావరణాన్ని చూపిస్తూ వెల్ కమ్ టు అంజనాద్రి 2.0 అంటూ పోస్ట్ చేశారు. జై హనుమాన్ హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లోని రఘునందన సాంగ్ అటాచ్ మెంట్ తో వచ్చిన వీడియో వైరల్ అయ్యింది. ఇక 2025 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకొస్తారని ఆ మధ్య వార్తలు జోరుగా

 వినిపించగా.. ఇప్పుడేమో 2026లో జై హనుమాన్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. అయితే PVCUలో భాగంగా మొదటి సినిమా ను ఆంజనేయుడిపైనే

 తెరకెక్కించి అద్బుతం చేసారు ఈ దర్శకుడు. ఈ యూనివర్స్‌లో ఇంకా చాలా సినిమా లు రాబోతున్నాయని ఇప్పటికే ప్రకటించారు ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ మొదటి సినిమా కూడా ప్రశాంత్ వర్మ టిక్ యూనివర్స్‌లో భాగమే. మోక్షు అనౌన్స్‌మెంట్ రావడంతో.. జై హనుమాన్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నిజానికి హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి రావాల్సిన జై హనుమానే. జనవరి 2025 అంటూ రిలీజ్ డేట్ కూడా ఆ మధ్య ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది దీనికోసం చాలా పెద్ద టీం కష్టపడుతున్నట్లు తెలిపారు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ కంటే ముందే PVCUలో భాగంగా అధీరా రానుంది.అయితే జై హనుమాన్ కంటే ముందు.. ప్రశాంత్ వర్మ టిక్ యూనివర్స్ నుంచి కనీసం 3 లు రానున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: