టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ఇటీవల షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఆయన కుడిచేతికి గాయం కాగా.. గత కొన్ని రోజులుగా గాయంతోనే రవితేజ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. విశ్రాంతి లేకపోవడంతో గాయం మరింత ఎక్కువ కావడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్లు తెలిపారు. రవితేజకు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఆర్టీ 75 సినిమా చిత్రీకరణలో
ఈ ప్రమాదం జరిగింది. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ని ధృవీకరించారు. అభిమానులకు అతను "బాగా ఉన్నాడని" హామీ ఇచ్చాడు. సర్జరీ సజావుగా జరగగా రవితేజ పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల విరామం తీసుకోనున్నారు. సామాన్యమైన శస్త్రచికిత్స తర్వాత విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యాడు మరియు బాగున్నాను అని అభిమానుల నుండి వచ్చిన మద్దతుకు
కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో రాశాడు. మీ అందరి హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు మద్దతు కోసం కృతజ్ఞతలు. త్వరలో తిరిగి సెట్‌లోకి రావడానికి సంతోషిస్తున్నాను అని అన్నారు. వర్క్ ఫ్రంట్‌లో, రవితేజ ప్రస్తుతం "సామజవరగమన" అనే హిట్ చిత్రాన్ని నిర్మించిన కొత్త దర్శకుడు భాను దర్శకత్వంలో కొత్త చిత్రం చేస్తున్నాడు. ఇక రవితేజ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావడంతో ఆయన అభిమానులు కాస్త ఊరట చెందారు. మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. .!!