ఓ జి నుండి షాకింగ్ అప్డేట్.. కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనకి డిప్యూటీ సీఎం పదవి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల సినీ లవర్స్ అందరూ ఎంతో ఆనందించారు. అయితే సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ సారి పవన్ బర్త్ డే ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్ కానుంది. ఎమ్మెల్యేగా గెలిచాక ఇది పవన్‌కు మొదటి పుట్టినరోజు. అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పవన్ బర్త్ డేను ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు అయన ఫాన్స్. మరోవైపు పవన్ సిమిమాలకు

 సంబంధించి మూడు సినిమాల పోస్టర్‌లు రానున్నట్టు తెలుస్తోంది. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు ఓజీ  నుంచి అప్డేట్స్ రానున్నాయి. అయితే ఓజీ నుంచి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి టీజర్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. ఇప్పటికే అంతకు మించి అనేలా ఓజీ టీజర్‌ని దర్శకుడు సుజీత్ కట్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది.  అయితే ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తుండడం వల్ల ఈ సినిమా షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి.

 అయితే నేడు ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య, డైరెక్టర్ సుజిత్ తో కలిసి పవన్ కళ్యాణ్ ని అమరావతిలోని సచివాలయం లో కలిసి డేట్స్ గురించి చర్చలు జరిపారు. దానికి సంబంధించిన ఫోటోలను   డీవీవీ దానయ్య అకౌంట్ నుండి పోస్టులు పడ్డాయి. ఆ తర్వాత సోషల్ మీడియా మొత్తం ఓజీ మేనియా తో ఊగిపోయింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. నేడు నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్, వచ్చే వారం నుండి షూటింగ్ పనులు ప్రారంభించుకోమని చెప్పినట్టు తెలుస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: