టాలీవుడ్ హీరో తో పీకల్లోకి ప్రేమలో పడ్డ త్రిష....?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష.... ఈ భామ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన నటన, అందంతో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. జోడి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఆ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. తన నటనను చూసిన డైరెక్టర్లు హీరోయిన్ గా ఛాన్సులు ఇచ్చారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడలోనూ ఎన్నో సినిమాల్లో నటించింది. త్రిష నటించిన రెండో చిత్రం వర్షం.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించి ఎంతో గుర్తింపు దక్కించుకుంది. ఈ మధ్యకాలంలో త్రిష తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. రీసెంట్ గా పోన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించి ప్రేక్షకులను అందించింది. ఇదిలా ఉండగా త్రిష నలబై పదుల వయసు వచ్చినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. త్రిష కొంతమంది హీరోలతో ప్రేమలో ఉందని, రిలేషన్ కొనసాగిస్తున్నట్లు, వివాహం చేసుకోబోతుందని ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.
కానీ ఇంతవరకు త్రిష ఎవరిని వివాహం చేసుకోలేదు. ఇక త్రిష ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరు అని ఆరా తీయగా.... ప్రభాస్ అని తెలిసింది. వీరిద్దరూ కలిసి వర్షం సినిమాలో నటించారు. ఆ సినిమాలో నటిస్తున్న సమయంలో త్రిష ప్రభాస్ తో ప్రేమలో పడిందట. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అంతా అనుకుంటారు. కానీ త్రిష మాత్రం ఇప్పటికే ప్రభాస్ ని ప్రేమిస్తుందని కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష.... ప్రభాస్ కాంబోలో పౌర్ణమి సినిమా కూడా వచ్చి సక్సెస్ అందుకుంది.ఇక ఇటీవలే.. కల్కీ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు హీరో ప్రభాస్.