విజయ్ "గోట్" కి అన్ని కోట్ల పారితోషకం తీసుకున్నాడా.. దెబ్బకి కోలీవుడ్ షాక్..?

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ ను ప్రారంభించిన తర్వాత చాలా సంవత్సరాల పాటు కేవలం తమిళ ఇండస్ట్రీ లో మాత్రమే మార్కెట్ ను కలిగి ఉన్నాడు. ఇక కొన్ని సంవత్సరాల క్రితం ఈయన మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన తూపాకీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు.

ఈ మూవీ టాలీవుడ్ లో అద్భుతమైన విజయం అందుకుంది. దీనితో ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే మెల్లిమెల్లిగా ఈయన తన మార్కెట్ ను దేశవ్యాప్తంగా పెంచుకుంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయనకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉండడంతో ఈయన నటించిన సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చిన కూడా అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ నటుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి యావరేజ్ టాక్ వచ్చింది.

అయిన కూడా ఈ మూవీ 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా ఈయనకు ఇంత అద్భుతమైన క్రేజ్ ఉండడంతో భారీ మొత్తంలో విజయ్ ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ "గోట్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు విజయ్ 180 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. యావరేజ్ టాక్ తోనే 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే ఈమేజ్ ఉన్న హీరోకు 180 కోట్ల రెమ్యూనరేషన్ పెద్ద విషయం ఏమీ కాదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: