"డార్లింగ్" కి పరీక్ష మొదలైంది.. ఇందులో సక్సెస్ అయితే హిట్ కొట్టినట్టే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి తాజాగా డార్లింగ్ అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో యువ నటిమని నబా నటేష్ ప్రియదర్శికి జోడిగా నటించగా ...  అశ్విన్ రామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. నిరంజన్ రెడ్డి ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనన్య నాగళ్ళ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాను జూలై 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. దానికి నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , అలాగే ఈ మూవీ బృందం వారు కూడా ప్రచారాలను పెద్ద ఎత్తున చేస్తూ ఉండటంతో ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు తెలియజేస్తూ ఒక పోస్టర్ నూ విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇక తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చినట్లు అయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నట్లే , ఇక ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినట్లు అయితే ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: