విశ్వంభర కోసం ఆ సినిమా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి దీనికి సంబంధించిన ఏవో ఒక విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కోసం ఆయన చేసిన ఒక బ్లాక్ భాస్కర్ మూవీ ను ఫాలో అవుతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. ఇక ఆ సినిమా మరేదో కాదు అంజి. 2004లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద

 హిట్ కాలేకపోయింది. అంతేకాదు సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్స్ సైతం సరిగా రాకపోవడంతో నిర్మాతలకి ఒకింత నష్టం చేకూరింది అని చెప్పాలి. ఇకపోతే ఏ సినిమా షూటింగ్ దాదాపుగా ఆరు సంవత్సరాలు జరిగింది. కాగా ఈ సినిమా మొత్తం ఒకే ఒక్క కాస్ట్యూమ్ లో కనిపిస్తాడు చిరంజీవి. అయితే తాజాగా ఇప్పుడు విశ్వంభర  సినిమా విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇలాగే కనిపించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.  50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో చిరంజీవి ఈ సినిమాకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, త్రిష  కాంబినేషన్ లో ఈ సినిమా

 తెరకెక్కుతుండటం గమనార్హం. స్టాలిన్  సినిమా తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. త్రిష ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. త్వరలో విశ్వంభర సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ రానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర సినిమా 2025 సంవత్సరం జనవరి 10వ తేదీన విడుదల కానుంది.యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది.అంతేకాదు, సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌ ఉండనున్నట్లు ఎప్పటినుంచో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో స్టార్‌ హీరోయిన్‌ త్రిష , ఆషికా అధికారికంగా జాయిన్‌ అయ్యారు.  ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: