NKR-21 గ్లింప్స్: వైజయంతి ఐపీఎస్ గా అదరగొట్టేస్తున్న విజయశాంతి..!

Divya
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ విజయశాంతి రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే.. ముఖ్యంగా ఈమెను లేడీ సూపర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న విజయశాంతి.. తన కెరియర్ లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రలలోనే నటించింది. సినిమాలను విజయశాంతి యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టేస్తూ ఉంటుంది.కానీ రాజకీయాలతో కొన్నేలు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విజయశాంతి మళ్ళీ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీయంట్రి ఇచ్చింది.

ఇక అప్పటినుంచి తన సెకండ్ ఇన్నించిన మొదలు పెట్టిన విజయశాంతి మంచి మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ నటించిన 21వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో విజయశాంతి మళ్ళీ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నది. నేడు విజయశాంతి పుట్టినరోజు కావడంతో కళ్యాణ్ రామ్ సినిమా నుంచి విజయశాంతి పాత్రకి సంబంధించి గ్లింప్స్ సరిత విడుదల చేశారు. ఇందులో విజయశాంతి ఐపీఎస్ వైజయంతి పాత్రలో కనిపించబోతోంది.

ముఖ్యంగా విజయశాంతి పాత్ర కూడా హైలెట్గా యూనిఫామ్ పౌరుషాన్ని తెప్పించే విధంగా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో కళ్యాణ్ రామ్ చెప్పే వాయిస్ ఓవర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విజయశాంతి అభిమానులకు ఈ సినిమా మరింత కంబ్యాక్  ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. మరి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్న విజయశాంతి ఈ సినిమాతో మరొకసారి మెప్పిస్తుందేమో చూడాలి. కళ్యాణ్ రామ్ 21వ సినిమా అని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన డైరెక్టర్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు ఇందులో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తున్నది. ప్రస్తుతం విజయశాంతికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరో కొద్దిరోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: