పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. దాదాపుగా 600 కోట్లకు పైగానే బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఈనెల 27న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేయడానికి కల్తీ సిద్ధంగా ఉంది అని ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఇప్పుడు సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుపుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అదేంటంటే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని డిజైన్ చేసినట్లుగా తెలిపాడు డైరెక్టర్.
కల్కి తో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాము అని తెలియజేశారు. అందరిలో ఆసక్తి మరింత పెంచడానికి త్వరలోనే కల్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారట. అంతేకాదు ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారట మేకర్స్. ఇంత గ్రాండ్ గా నిర్వహించే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరు అన్న వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు దీనికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్
చిరంజీవి రాబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఆయనతోపాటు మరికొందరు తెలుగు స్టార్ హీరోలు సైతం ఈవెంట్ కి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే ప్రభాస్ తన సినిమాను హిట్ చేసుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. జనాల్లోకి సినిమా తీసుకు వెళ్లడానికి భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఐకపోతే జూన్ రెండవ వారంలో కల్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు గా వార్తలు వినబడుతున్నాయి. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మాత్రమే కాకుండా అమితాబచ్చన్ కమలహాసన్ వంటి స్టార్స్ సైతం నటించారు. మరి ఇంత మంది స్టార్ క్యాస్ట్ ఉన్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!