'హరిహర వీరమల్లు' తో మళ్ళీ స్పీడ్ పెంచిన పవర్ స్టార్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరొకవైపు సినిమాలు కూడా చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎప్పటినుండో డిలే అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కాగా ఈ సినిమాను జ్యోతి కృష్ణ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా మిగిలిన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు క్రిష్

 దగ్గరుండి చేస్తున్నడు. కాగా మెగా సూర్యా ప్రొడక్షన్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏయం రత్నం భారీ  బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే పవర్ స్టార్ నటిస్తున్న హరిహర వీరమలు 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి జీవిత కథ ఆధారంగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం భారీ సెట్ లను ఏర్పాటు చేసినట్లుగా సమాచారం.  అందులో భాగంగానే నిర్మాతలు దీనికోసం చార్మినార్ ఎర్రకోట తో పాటు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్ లను నిర్మించినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వీటిని నిర్మించడంలో ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు మేకర్స్. అయితే ఈ సినిమా చేస్తున్నట్లు ఎప్పుడో

 ప్రకటించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రావడంతో అక్కడ ఎలక్షన్ పనితో బిజీగా మారడు. అలా అప్పటినుండి ఈ సినిమాకి సంబంధించిన పనులకు ఏవో ఒక ఆటంకులు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు.. భారతదేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ప్రముఖ టోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈ కి సంబంధించిన టోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే ఈ షూటింగ్ ను ప్రారంభించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే నిర్మాత ఏం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్‌లతో మనోజ్ పరమహంస చర్చిస్తున్న ఒక ఫోటోని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. అంతేకాదు కి సంబంధించిన షూటింగ్ త్వరితగతిన పూర్తిచేసేందుకు కొత్త లొకేషన్ల కోసం రెక్కీ కూడా పూర్తి చేస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: