పుష్ప 2 సాంగ్స్ లో ఏదో మిస్ అవుతోంది.. అదేంటంటే..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలకి తగ్గట్లుగానే రోజుకి ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో  సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే  గత కొద్ది రోజుల క్రితం పుష్ప 2 నుండి ఫస్ట్ సింగిల్ సైతం విడుదల చేశారు.  ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ సోషల్

 మీడియాలో దుమ్ము రేపుతోంది అని చెప్పాలి. తాజాగా ఇప్పుడు మళ్ళీ సెకండ్ సింగిల్ కూడా విడుదల చేశారు మేకర్స్. సుసేకి నా సామి అంటూ సాగే ఈ పాట కూడా సోషల్ మీడియాలో  ట్రెండింగ్ లో ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ పుష్ప మొదటి పార్ట్ లో వచ్చిన పాటలతో పోలిస్తే పార్ట్ 2 లో వచ్చిన పాటలు సినిమాపై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి అని అంటున్నారు చాలామంది. అయితే పుష్ప పార్ట్ వన్ లో వచ్చిన ప్రతి పాట కూడా హిట్ గా నిలిచింది. కానీ ఇప్పుడు మాత్రం పుష్ప టు నుండి విడుదలైన

 రెండు పాటల్లో ఏదో మిస్ అవుతుంది అని చాలామంది వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో దేవిశ్రీ ఇచ్చే మ్యూజిక్ లో సోల్ మిస్ అవుతుంది అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అయితే మొదటి పార్ట్ లో ఉన్న ఫీల్ పార్ట్ 2 లో నుండి వచ్చిన సాంగ్స్ లో లేదు అని తేలిపోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో సాంగ్స్ పెద్దగా సక్సెస్ కావడం లేదు అని చెప్పాలి. ఇకమీదట వచ్చే పాటల్లో ఆయన కొత్తదనం ఏమైనా క్రియేట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇక ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ పాటల విషయంలో ఆ ఫీల్ లేదు అని తెలుస్తోంది. సినిమా మీద ఉన్న హైప్ పాటల మీద కూడా వస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ లో బ్లాక్ బస్టర్ అవుతుంది అని భావిస్తున్నారు ఫాన్స్. మరి వచ్చే సాంగ్స్ లో అయినా ఆ సోల్ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: