"హరిహర వీరమల్లు" విడుదలకు అంతా సిద్ధం... ఆ నీళ్లలోనే రిలీజ్..?

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చాలా రోజుల క్రితమే హరి హర విరమల్లు అని మూవీ మొదలు అయింది. ఈ సినిమా మొదలు అయ్యి కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత పవన్ "భీమ్లా నాయక్" మూవీ పై ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టాడు. దానితో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఆ గ్యాప్ లో క్రష్ కూడా కొండపొలం అనే మూవీ ని తెరకెక్కించాడు. వీరిద్దరూ తమ తమ సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ రీ స్టార్ట్ చేశారు.

కానీ ఆ తర్వాత పవన్ ఎలక్షన్ ల బిజీలో ఉండడంతో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి ఏ ఎం రత్నం కూడా ఈ మూవీ నుండి క్రిష్ తప్పుకున్నారు అని తన కుమారుడు అయినటువంటి జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాడు అని ఈ సినిమా యొక్క మిగిలి ఉన్న షెడ్యూల్స్ ని జ్యోతి కృష్ణ పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఈయన ప్రకటించాడు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ను మరికొన్ని రోజుల్లోనే రీ స్టార్ట్ చేయనున్నట్లు , వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ నీ పూర్తి చేసి ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ప్రణాళికలను వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఏం ఏం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk

సంబంధిత వార్తలు: