
జీవో 117కు బైబై అంటోన్న విద్యాశాఖా మంత్రి లోకేష్....!
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషి ...
అందరినీ భాగస్వామ్యం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషిచేస్తున్నాం. 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే..వన్ క్లాస్, వన్ టీచర్ అందిస్తున్నాం. 7 నుంచి 8వేల మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటుచేస్తాం. ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ ఇవ్వాలని కోరుతున్నారు. రెండో విడతలో ప్రతి పంచాయతీ మోడల్ స్కూల్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది సాధిస్తాం. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ను కొనసాగిస్తాం. ప్రీ స్కూల్స్ విషయంలో ఫ్రేమ్ వర్క్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
విద్యలో కాషాయికరణపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలి...
అంతకుముందు విద్యలో కాషాయికరణ అంటూ వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనం. కరిక్యులమ్ విషయంలో మతాన్ని తీసుకురావడం సరికాదు. వైసీపీ హయాంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అంటే అర్థం ఏమిటి? ఇస్లాం గురించి మాట్లాడారు, క్రిష్టియానిటీ గురించి మాట్లాడారు. హిందూమతం గురించి ఎక్కడా మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరివాడు.. ముస్లీం, క్రిష్టియన్, హిందూ అయినా అందరివాడని మేం పెట్టాం. ఏమతాన్ని కించపరచలేదు. అనవసరమైన వివాదాన్ని లేవనెత్తుతున్నారు. విద్యలో కాషాయికరణపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.