నారా లోకేష్ లెక్క ఇది... ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది... !

frame నారా లోకేష్ లెక్క ఇది... ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది... !

RAMAKRISHNA S.S.
బ్రాండ్ “బాబు” తిరిగి వచ్చారు, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చింది. ఇటీవల నేను డిల్లీలో ఒక ప్రముఖ ఛానల్ ఫైర్‌సైడ్ చాట్ కోసం వెళ్ళాను. అక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి, మరికి ఎపికి ఏం ఉందని అడిగారు.  ఎపిలో సిబిఎన్ ఉన్నారని నేను గర్వంగా చెప్పాను. ఈరోజు మేం చంద్రబాబునాయుడుపై అదే నమ్మకంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంటును మంత్రి లోకేష్ చేతులమీదుగా ప్రారంభించారు. తొలుత మంత్రి లోకేష్ అశోక్ లేలాండ్ తయారు చేసిన డబుల్ డెక్కర్ బస్సులో ప్లాంటు వద్దకు విచ్చేసారు. ప్లాంటు ఆవరణలో మొక్క నాటిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్లాంటును ప్రారంభించారు. తర్వాత అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన ఎం ఎస్ ఆర్టీసి బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం లోకేష్ మాట్లాడుతూ... మల్లవల్లిలో అశోక్ లేలాండ్ అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ప్రారంభోత్సవానికి ఈరోజు ఇక్కడ ఉండటం ఒక గౌరవం గా భావిస్తున్నాను. 2023 ఆగస్టు 24న నా పాదయాత్ర సందర్భంగా నేను మల్లవల్లికి వచ్చినపుడు అశోక్ లేలాండ్‌ను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చాను. అది నేడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. అశోక్ లేలాండ్, హిందూజా గ్రూపునకు చెందిన పెద్దలు, పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులకు నా అభినందనలు. దేశచరిత్రలో మరే ఇతర రాజకీయ పార్టీ ప్రకటించని విధంగా అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాం. మీరు సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి మరో 4 పరోక్ష ఉద్యోగాలు తోడై రాష్ట్రాభివృద్ధికి ఊతమిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక పునరుజ్జీవనానికి చిహ్నంగా మార్చేందుకు మీవంటి వారి భాగస్వామ్యం మాకు శక్తినిస్తుంది. స్థిరమైన అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. ప్రకాశవంతమైన, పచ్చని, స్థిరమైన రేపటి  భవితవైపు ముందుకు సాగుదాం. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందుతున్న పెట్టుబడులకు గమ్యస్థానంగా, తయారీరంగంలో అగ్రగామిగా నిలుపుదామ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: