
టాలీవుడ్ సినిమాల్లో డాన్సులు పై ... మహిళా కమిషన్ సీరియస్ ..!
అయితే ఇప్పుడు వీటన్నిటిని దృష్టి లో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషనర్ సీరియస్ గా మారింది .. సినిమా పేర్ల ను నేరుగా ప్రస్తావించకుండా మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్ ను వెంటనే ఆపేయాలని అటు ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది కమిషన్ . అలాగే కొన్ని సినిమా పాట లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ ఎంతో అసభ్యకరంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ పలు ఫిర్యాదులు అందయని కూడా మహిళా కమిషన్ తెలిపింది .
డైరెక్టర్ లు , నిర్మాతలు , కొరియోగ్రాఫర్లు కొంత బాధితరహితంగా వ్యవహరించాలని చిత్ర పరిశ్రమకు హెచ్చరిక జారీ చేసింది . అదే విధంగా యువత , పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టి లో పెట్టుకుని .. తెలుగు చిత్ర పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతో ఉందని మహిళా కమిషన్ అభిప్రాయపడింది .. అదే విధంగా ఈ విషయాల పై ప్రజలు సామాజిక సంస్థలు తమ అభిప్రాయాల ను మహిళా కమిషన్ కు చెప్పవచ్చని తెలిపింది . రాబిన్ హుడ్ రిలీజ్ కి ముందు మహిళా కమిషన్ ఊహించని హెచ్చరిక వచ్చి పడింది .