హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ధనుష్ కి కలిసొచ్చిన బిచ్చగాడి స్టోరీ.. "కుబేర"తో బాక్సాఫీస్ షేక్ !

Pandrala Sravanthi
ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాల్లో ధనుష్ నటించిన కుబేర మూవీ కూడా ఉంది. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో తన సహజనటనతో ఎంతోమందిని అలరించారు. అలాగే ఈ సినిమాలో నాగార్జున మొట్టమొదటిసారి ఓ కీలక పాత్రలో నటించారు.అలా నాగార్జున కీ రోల్ పోషించిన కుబేర మూవీలో ధనుష్ హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా.. అమీగోస్ క్రియేషన్స్ లో సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ నిర్మించిన ఈ మూవీ ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కింది. అలా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన కుబేర మూవీ స్టోరీ ఎంతో మందిని ఆకట్టుకుంది.స్టోరీకి తగ్గట్టే ధనుష్ యాక్టింగ్ తో కూడా ఇరగదీసారు. అలా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైన కుబేర మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసి దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక కుబేర మూవీ తిరుపతి వీధుల్లో ఉండే బిచ్చగాడు ధనుష్ కుబేరుడిగా ఎలా మారారు అనేది చూపించారు. 


ఈ సినిమాలో నాగార్జున ఒక నిజాయితీ ఆఫీసర్గా కనిపిస్తారు.కానీ తాను ఎంత నిజాయితీగా ఉన్నా తనని అవినీతిపరుడు అనే ముద్ర వేశారు అనే కోపంతో మొట్టమొదటిసారి నాగార్జున జైలు నుండి బయటకు రావడం కోసం అవినీతికి ఒప్పుకుంటాడు.అలా ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త కోసం అవినీతి చేయడానికి రెడీ అవుతారు. అలా బంగాళాఖాతంలో అరుదైన చమురు నిల్వను కనుగొన్న సమయంలో ఆ చమురుని సంపద మరియు రాజకీయ నియంత్రణకు మూలంగా మార్చాలనే ఆత్రుతతో ఆ వ్యాపారవేత తండ్రితో కలిసి అగ్ర రాజకీయ నాయకులను కలుపుకొని ఒక రహస్య మిషన్ ని ప్రారంభిస్తాడు. ఇక అవినీతిని నీతి నిజాయితీకి మారుపేరైన జైల్లో ఉన్న సిబిఐ ఆఫీసర్ నాగార్జునకి అప్పచెప్పుతారు. అలా నాగార్జున తన తెలివితో బిచ్చగాళ్లను ఎంపిక చేసుకొని వారి అకౌంట్లో డబ్బులు వేసి బ్లాక్ మనీని వైట్ మనీ గా చేస్తారు. ఆ సమయంలో నలుగురు బిచ్చగాళ్లని ఎంపిక చేసుకుంటారు. కానీ ఆ సమయంలో పని పూర్తవడంతోనే ఇద్దరు బిచ్చగాళ్లను చంపేస్తారు.


 అందులో ఉండే ఒక అమ్మాయి కడుపుతో ఉండడంతో ఆమెని నాగార్జున దాచిపెడతాడు. కానీ ఇదంతా తెలిసిన ధనుష్ వారి నుండి తప్పించుకొని తిరుగుతాడు. కానీ ఆ సమయంలో ధనుష్ అకౌంట్లో డబ్బులు ఉండడంతో వ్యాపారవేత్త కి సంబంధించిన మనుషులు ధనుష్ ని వెంటాడుతూ ఉంటారు. అలా జరిగిన సమయంలో రష్మిక పరిచయం అవుతుంది. ధనుష్ తన అకౌంట్లో ఉన్న డబ్బులతో ఏం చేస్తాడు.. వ్యాపారవేత మనుషులతో ఏ విధంగా పోరాడుతాడు.. చివరికి ఆ వ్యాపారవేత్తకు ఎలా బుద్ధి చెబుతారు అనేది ఈ సినిమాలో చూపిస్తారు. అలా బిచ్చగాడి గా ఉన్న ధనుష్ ఒక్కసారిగా కుబేరుడి గా మారతాడు. ఒక డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్న శేఖర్ కమ్ముల కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమాతో ధనుష్ కెరీర్ లో కూడా మంచి హిట్టు పడింది. అంతేకాకుండా ధనుష్ ఏ పాత్రలో అయినా సరే ఇట్టే ఒదిగిపోతారు అని కుబేర సినిమాతో మరోసారి రుజువైంది. ఇక ఈ సినిమా తర్వాత ఇడ్లీ కడై సినిమాతో మరోసారి ఓ మాదిరి హిట్ కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: