నిఖిల్ సిద్ధార్థ ఈ పేరు ఒకప్పుడు చిన్న హీరో గా కొంతమందికి మాత్రమే తెలుసు.కానీ ప్రస్తుతం నిఖిల్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగిపోయింది.చదు మొండేటి డైరెక్షన్లో వచ్చిన కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ రేంజ్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఆయన ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే అలాంటి నిఖిల్ సినీ కెరియర్ సంబరం, హ్యాపీడేస్ వంటి మూవీస్ తో మొదలై ఎన్నో సినిమాల వరకు సాగుతోంది.ముఖ్యంగా ఈయన సినీ కెరియర్లో హ్యాపీడేస్, యువత, స్వామి రారా, కార్తికేయ, కార్తికేయ టు, ఎక్కడికి పోతావు చిన్నవాడా, 18 పేజెస్ వంటి ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక గత ఏడాది అప్పుడో ఇప్పుడు ఎప్పుడో అనే సినిమాతో వచ్చినప్పటికీ అది హిట్ కొట్టలేదు.
కార్తికేయ 2 తర్వాత 18 పేజెస్ మూవీ కూడా హిట్టు కొట్టడంతో నిఖిల్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన స్పై అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వంటి రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ ఆశలన్నీ స్వయంభు మూవీ పైనే ఉన్నాయి. ముఖ్యంగా నిఖిల్ కి దేవుడి సెంటిమెంట్ తో వచ్చే సినిమాలతో హిట్టు కొడుతున్నారు. అలా మరోసారి స్వయంభు సినిమాని నమ్ముకున్నారు. ఈ విషయం పక్కన పెడితే నిఖిల్ ఇప్పటివరకు ఏ ఒక్క హీరోయిన్ కూడా లిప్ లాక్ పెట్టలేదు. అది కూడా తన తల్లికి ఇచ్చిన ఈ విషయాన్ని ఆలీతో సరదాగా అనే షోలో నిఖిల్ చెబుతూ నేను మా అమ్మకు ఇండస్ట్రీకి వచ్చే ముందే ఒక ప్రామిస్ చేశాను.
ఎందుకంటే మా అమ్మ సినిమాల్లోకి వచ్చే ముందు నువ్వు ఏ హీరోయిన్ కి కూడా లిప్ లాక్ ఇవ్వకూడదు అని కండిషన్ పెట్టింది. అమ్మ కండిషన్ కి ఒప్పుకునే నేను సినిమాల్లోకి వచ్చాను. అందుకే ఇప్పటి వరకు నేను ఒక్క లిప్ లాక్ సీన్ కూడా చేయలేదు.హెబ్బా పటేల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా సమయంలో లిప్ లాక్ సీన్ ఎదురైనప్పటికీ నేను చేయను అని చెప్పేసాను అంటూ నిఖిల్ చెప్పుకొచ్చారు.తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో కూడా నిఖిల్ లిప్ లాక్ సీన్ చేయలేదట.