సమ్మర్ వార్ ఈ ముగ్గురికి ఎంతో కీలకం ..!

frame సమ్మర్ వార్ ఈ ముగ్గురికి ఎంతో కీలకం ..!

Amruth kumar
ఈ సమ్మర్ ముగ్గురు హీరోలకు గట్టి పరీక్ష .. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అందుకోవాల్సిందే .. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ , టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ , కోలీవుడ్లో సూర్య .. ఈ హీరోలు నటించిన సినిమాలు ఈ సమ్మర్ కు రాబోతున్నాయి .. ఈ ముగ్గురికి ఈ సినిమాలు ఎంతో కీలకం .. ఇక ముందుగా విజయ్ దేవరకొండ విషయానికి వస్తే .. ఈ రౌడీ హీరో కింగ్డమ్ సినిమా మే 30న రిలీజ్ అవుతుంది .. ఈ సినిమా విజయ్ కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. ఫ్యామిలీ స్టార్ లాంటి ప్లాఫ్ తర్వాత కచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితికి వచ్చేసాడు విజయ్ .. మొదటిసారిగా ఆయన నటనపై విమర్శలు వచ్చాయంటే అది ఫ్యామిలీ స్టార్‌ సినిమా నుంచి .. సో కింగ్డంతో ఈ హీరో హిట్ అందుకోవాల్సిందే .
ఇక సూర్య నటించిన కంగువపై కూడా దాదాపు ఇలాంటి విమర్శలు గట్టిగా వచ్చాయి .. కంగువ రివ్యూలపై ఇప్పటికే జ్యోతిగా ఫీల్ అవుతుంటే ఆ సినిమా ఎఫెక్ట్ సూర్య కేరీర్‌ పై ఎంత పడిందో అర్థం చేసుకోవచ్చు . అందుకే ఈ వేసవికి రిట్రో తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు సూర్య .. ఇప్పటికే విజయ్‌ రాజకీయాల్లోకి వెళ్లిన‌ నేపథ్యంలో కోలీవుడ్లో ఉన్న ఆ గ్యాప్ ను భ‌ర్తి చేయాలని ఇప్పటికే చాలా మంది హీరోలు ప్రయత్నిస్తున్నారు .. ఈ వార్‌లో నిలబడాలంటే రెట్రతో సూర్య పెద్ద విజయం అందుకోవాల్సిన పరిస్థితి ఉంది .
చివరగా మరో హీరో సల్మాన్ ఖాన్ .. ఈ రీసెంట్ టైమ్స్ లో తన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు ఈ కండలు వీరుడు.  ఇక ఇప్పుడు త్వరలోనే రిలీజ్ కాబోతున్న సికిందర్ సినిమా సల్మాన్ ను మరోసారి బాక్సాఫీస్ వార్‌లో మొదటి ప్లేస్ లో నిలబడుతుందో లేదో చూడాలి .. ఇలా ఒకేసారి మూడు భాషలకు చెందిన ముగ్గురు హీరోలు ఈ సమ్మర్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు .. ఈ వార్‌లో మొన్నటి వరకు రవితేజ కూడా ఉన్నప్పటికీ అయ‌న‌ సినిమా వాయిదా  పడింది . మరి ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలో ఎవరు ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: